సాహో క్రేజ్ భారీగానే ఉంది

భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన ఆగష్టు 30 న విడుదలకబోతున్న సాహో సినిమా క్రేజ్ ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ మాములుగా లేదు. ఓ చిన్న [more]

Update: 2019-08-14 05:59 GMT

భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన ఆగష్టు 30 న విడుదలకబోతున్న సాహో సినిమా క్రేజ్ ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ మాములుగా లేదు. ఓ చిన్న డైరెక్టర్ నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో సినిమా ఎలా తెరకెక్కిస్తాడో అని అందరూ అనుకున్నారు. కానీ సాహో మేకింగ్ అండ్ ట్రైలర్ చూసిన తరవాత సాహో సినిమాకి సుజిత్ ఎంతగా కష్టపడ్డాడో అనిపించడమే కాదు… ఆ సినిమాకి అంత భారీ బడ్జెట్ ఎందుకు అయ్యిందో అర్ధమవుతుంది. ప్రభాస్ నేషనల్ హీరో. శ్రద్ద కపూర్ బాలీవుడ్ హీరోయిన్. సినిమా మొత్తం బాలీవుడ్ నటులు ఉండడం, అలాగే వరల్డ్ వైడ్ గా సాహో మీద బీభత్సమైన క్రేజ్ ఉండడంతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. సాహో డిజిటల్, శాటిలైట్ హక్కులు కాకుండా కేవలం థియేట్రికల్ రైట్స్ కే వరల్డ్ వైడ్ గా 333.00 కోట్లు జరిగింది అంటే సినిమాపై అంచనాలు ఎంతగా ఉన్నాయో అర్ధమవుతుంది. మరి ఈ అంచనాలు సాహో అందుకుందో లేదో అనేది మరో 15 రోజుల్లో తెలుస్తుంది.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నిజాం 40.00
సీడెడ్ 25.00
నెల్లూరు 4.50
కృష్ణ 8.00
గుంటూరు 12.50
వైజాగ్ 16.00
ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి 19.00

టోటల్ ఏపీ & టీస్: 125.00
కర్ణాటక 28.00
తమిళనాడు అండ్ కర్ణాటక 18.00
నార్త్ 120.00
ఓవర్సీస్ 42.00

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 333.00

Tags:    

Similar News