యాక్షన్ ఎంతసేపు నిలబెడుతుంది

టాలీవుడ్ లో అత్యంత భారీతనం తో తెరకెక్కిన సాహో సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమాపై ట్రేడ్ [more]

Update: 2019-08-28 05:19 GMT

టాలీవుడ్ లో అత్యంత భారీతనం తో తెరకెక్కిన సాహో సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమాపై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ పిచ్చ ఆసక్తి క్రియేట్ అయ్యింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. భారీ చేజింగ్స్, భారీ ఫైట్స్, ఇలా సినిమాలో దాదాపుగా 50 నిముషాలు యాక్షన్ సన్నివేశాలే ఉంటాయని అంటున్నారు. మరి భారీ యాక్షన్ సన్నివేశాలు చూడడానికి బావుంటాయి కానీ.. సినిమా ఫ్లో లో వెళుతున్నప్పుడు ప్రతిసారి ఫైట్ సీన్ వస్తే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. మామూలుగానే ఇప్పటి సినిమాల్లో ఫస్ట్ హాఫ్ లో ఓ ఫైట్, క్లయిమాక్స్ లో ఓ ఫైట్ కి తగ్గించేశారు. ఎందుకంటే ప్రేక్షకుడు యాక్షన్ కన్నా ఎక్కువగా కామెడీ కి, కథకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

మరి యాక్షన్ సీన్స్ లో భారీ తనం…. చేజింగ్స్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయినా.. ఎప్పుడూ యాక్షన్స్ సీన్స్ కనబడితే.. సినిమా మీద ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తాడు. అందుకే సాహో టీం కూడా ఇప్పుడు సాహో పాటలను విజువల్ గా వదులుతూ సినిమాలో యాక్షన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందొ.. లవ్ ట్రాక్ కి, ఎమోషన్స్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంది.. అని చూపిస్తున్నారు. అందుకే ప్రభాస్ తో శ్రద్ద కపూర్ రొమాంటిక్ సన్నివేశాలు, పాటల్లో ప్రేమ తాలూకు సీన్స్, అలాగే జాక్విలిన్ తో ప్రభాస్ హాట్ స్టెప్స్ అన్ని చూపిస్తున్నారు. అలాగే ప్రభాస్ కూడా పలు సాహో ఇంటర్వూస్ లో యాక్షన్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు…. కారు రేసులు, బైక్ రేసు లు కూడా కొత్తగా చూపించాం అంటూ చెప్పుకొస్తున్నాడు. అయితే ప్రభాస్ చెప్పినట్టుగా హాలీవుడ్ రేంజ్ లో సాహో ఫైట్స్ ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్నప్పటికీ…. యాక్షన్ మోతాదు మించితే కష్టమే సుమీ అంటున్నారు.

Tags:    

Similar News