ఇదేం లుక్ డార్లింగ్..!

Update: 2018-12-08 07:38 GMT

డార్లింగ్ ప్రభాస్ బాహుబలిలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా అదరగొట్టే రాజసంతో కనిపించాడు. ఇక సాహోలో ఆరడుగుల ఆజానుబాహుడిలా కనబడుతున్నాడు. మరి సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అనేది సాహో ఫస్ట్ లుక్ తో ఒక ఐడియా కి వచ్చేసాం. కానీ రాధాకృష్ణ తో చెయ్యబోయే సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ ఒక ఐడియా కూడా లేదు. ప్రస్తుతం ఎక్కడా బయట కూడా ఫోకస్ అవకుండా రెండు సినిమాల షూటింగ్ తో బాగా బిజీగా ఉంటున్న ప్రభాస్ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో బబ్లీ ఫేస్ తో దర్శనమిచ్చాడు. ఎపుడూ జిమ్ బాడీ తో అదరగొట్టే ప్రభాస్ ఈసారి కాస్త ఒళ్ళు చేసినట్లుగా కనబడుతున్నాడు. ఆ బరువు ఛాయలు మోహంలో కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ ముంబై వెళ్ళింది మాత్రం బాహుబలిని బాలీవుడ్ లో మార్కెట్ చేసిన కరణ జోహార్... నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమం కోసం అని చెబుతున్నారు. బాహుబలి టీం అయిన రాజమౌళి, రానా, ప్రభాస్ లతో కరణ్ తన కాఫీ విత్ కరణ్ కార్యక్రమాన్ని షూట్ చేయబోతున్నాడట.

Similar News