నిన్నటివరకు టెన్షన్.. కానీ ఈరోజు హ్యాపీ

ఈ ఏడాది దిగబోయే భారీ ప్రాజెక్టులలో ప్రభాస్ సాహో తో పాటుగా.. చిరు సై రా సినిమాలు ఉన్నాయి. భారీ అంటే 250 నుండి 300 కోట్ల [more]

Update: 2019-07-17 04:38 GMT

ఈ ఏడాది దిగబోయే భారీ ప్రాజెక్టులలో ప్రభాస్ సాహో తో పాటుగా.. చిరు సై రా సినిమాలు ఉన్నాయి. భారీ అంటే 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో సాహో తెరకెక్కితే.. 200 కోట్ల బడ్జెట్ తో సై రా నరసింహ రెడ్డి తెరకెక్కింది. అయితే ఈ భారీ సినిమాలు రెండిటిలో సాహో ఆగష్టు 15 న, సై రా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతుండగా.. వాటికి ఎదురొచ్చే సాహసం మరే ఇతర సినిమాలు చెయ్యడం లేదు. సాహో ముందు వెనక విడుదలయ్యే సినిమాలు కాస్త టెన్షన్ పడుతున్నాయి కూడా. పలు మీడియం, చిన్న సినిమాలకు ఆగష్టు నెల చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, రాఖి పౌర్ణమి ఇలా సెలవలు బాగా కలిసొస్తాయని.. చాలా సినిమాలు ఆగష్టు లో దిగడానికి సుముఖత చూపుతాయి. కానీ ఆగష్టు 15 న సాహో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాక.. చాలా సినిమాలు ఆగష్టు నుండి వెళ్లిపోయాయి. ఇక తాజాగా సాహో విడుదల ఆగస్టు 15 నుండి వాయిదా పడడంతో.. చాలా సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి.

వారిలో సీనియర్ హీరో నాగార్జున ఒకరు. నాగార్జున మన్మధుడు 2 సినిమా ఆగష్టు 09 అంటూ డేట్ లాక్ చేశారు. అయితే ఆగష్టు 9 న విడుదల చేస్తే ఒక్క వారానికే సాహో సినిమా వచ్చేస్తే… మరి వారం తిరక్కుండానే సర్దుకోవాలి. కానీ సాహో విడుదల ఆగష్టు 15 నుండి వాయిదా పడడంతో… నాగార్జున ఇప్పుడు టెన్షన్ తప్పించుకున్నాడు. రాహుల్ దర్దకత్వంలో రకుల్ తో కలిసి నటించిన నాగార్జున.. మన్మధుడు 2 మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే సమంత, కీర్తి సురేష్ వంటి టాప్ హీరోయిన్స్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చెయ్యడం, మన్మధుడు సినిమా హిట్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కడంతో ఈసినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఎన్ని అంచనాలు ఉన్నప్పటికీ.. ఎంత హిట్ టాకొచ్చినా.. సాహో సినిమా థియేటర్స్ లోకి వస్తే… ఖచ్చితంగా మన్మధుడు సర్దుకోవాల్సిందే. ఇక సాహో అలా పోస్ట్ పోన్ అన్నారో లేదో… ఇలా శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు సినిమాలు ఆగష్టు 15 కి రావడానికి రెడీ అయ్యాయి.

Tags:    

Similar News