సాహో దెబ్బకి ఎవరు ముందుకొస్తారు

రన్ రాజా రన్ అనే చిన్న సినిమా చేసిన దర్శకుడికి సాహో లాంటి పెద్ద సినిమా అప్పజెబితే ఫలితం ఎలా ఉంటుందో అనేది సుజిత్ దర్శకత్వంలో క్లియర్ [more]

Update: 2019-11-19 05:02 GMT

రన్ రాజా రన్ అనే చిన్న సినిమా చేసిన దర్శకుడికి సాహో లాంటి పెద్ద సినిమా అప్పజెబితే ఫలితం ఎలా ఉంటుందో అనేది సుజిత్ దర్శకత్వంలో క్లియర్ కట్ గా తెలిసింది. చిన్న సినిమాని హ్యాండిల్ చేసిన వాడికి ఒకేసారి పెద్ద సినిమా అప్పజెబితే వణకడం ఖాయం. సాహో విషయంలో అలాంటిది ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సాహో లాంటి భారీ యాక్షన్ డిజాస్టర్ సినిమా తీసిన సుజిత్ కి మళ్ళీ పిలిచి ఎవరు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా అయితే ఇప్పట్లో సుజిత్ ని ఏ హీరో కూడా పట్టించుకోరు. కానీ రన్ రాజా రన్ తో తనకి హిట్ ఇచ్చాడని శర్వానంద్ మరోసారి సుజిత్ తో చెయ్యాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

సాహో తర్వాత చిన్న చిత్రంగా సుజిత్, శర్వానంద్ కోసం కథ రెడీ చేసుకున్నాడని ఫిలింనగర్ టాక్. ఇందులో బడ్జెట్ తక్కువ, కామెడీ ఎక్కువ, యాక్షన్ సమపాళ్లలో ఉండబోతున్నాయని అంటున్నారు. అయితే సుజిత్ కి నిజంగానే శర్వానంద్ అవకాశం ఇస్తున్నాడా? అనేదాని మీద ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. అయితే సుజిత్ మాత్రం శర్వా ని వదలడం లేదని అంటున్నారు. ఎలాగైనా ఓ కామెడీ కథతో నీకు హిట్ ఇస్తానని శర్వకి సుజిత్ భరోసా ఇస్తున్నాడట. మరి శర్వానంద్.. సుజిత్ భరోసాని నమ్ముతాడో లేడో చూడాలి.

Tags:    

Similar News