సుజిత్ ని బ్లేమ్ చెయ్యడానికి లేదా?

ప్రభాస్ ఏంతో ఆశపడి ఇష్టపడి చేసిన సాహో ప్లాప్ అయ్యింది. ఫస్ట్ వీక్ లో సాహో కేవలం రూ.188 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. అంటే అటు ఇటుగా [more]

Update: 2019-09-07 07:16 GMT

ప్రభాస్ ఏంతో ఆశపడి ఇష్టపడి చేసిన సాహో ప్లాప్ అయ్యింది. ఫస్ట్ వీక్ లో సాహో కేవలం రూ.188 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. అంటే అటు ఇటుగా యువీ వారికి రూ.100 కోట్ల నష్టం ఖాయం. రెండో వారంలోనూ సాహో కి పోటీ లేకపోయినా… సాహో లో విషయం లేకపోవడంతో.. సినిమాథియేటర్స్ లో ఉన్నప్పటికీ.. కలెక్షన్స్ రావు. అయితే రూ.50 కోట్ల కథని రూ.330 కోట్ల కథగా మార్చడంలో యువీ నిర్మాతలు, ప్రభాస్ మాత్రమే కారణం. దర్శకుడు సుజిత్ ది మధ్యలో ఏం లేదు. చిన్న దర్శకుడు కాబట్టి ప్రభాస్, నిర్మాతలు చెప్పింది చేసాడు.

సాహో ఫ్లాప్ కు కారణమేంటి…?

అసలు సినిమా నిడివి విషయంలోనూ, పాటల విషయంలోనూ సుజిత్ ముందు నుంచి అభ్యంతరాలు చెప్పినా…సాహో నిర్మాతలు మాత్రం సుజిత్ చెబితే వినాలా అన్నట్టుగా వ్యవహరించారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. పాటలు ఈ సినిమాకి వర్కౌట్ కావని.. హిందీలో సాంగ్స్ ఉంచి. తెలుగులో లేపెద్దామని సుజిత్ చెప్పాడట. కానీ తెలుగు ప్రేక్షకులకు పాటలు లేకపోతే సినిమా ఎక్కదన్నారట. కాకపోతే సాహో లో మొదటి యాక్షన్ సీన్ అవ్వ‌గానే ప్ర‌భాస్‌పై ఓ ఇంట్రో సాంగ్ ని కూడా ప్లాన్ చేశారట‌. కానీ… ఆ పాట వలన సినిమా కథ గమనం మారుతుందని భావించి ఆ పాటను రికార్డ్ చేయించినా స‌రే.. చిత్రీక‌రించ‌కుండా ఆపేశారట‌.నిడివి విషయంలోనూ సుజిత్ చెప్పినా యువీ వారు పట్టించుకోలేదట. అందుకే సాహో ప్లాప్ ని సుజిత్ కి అంటగట్టలేమేమో?

Tags:    

Similar News