సాహో విషయంలో చేసిన తప్పే రిపీట్ చేస్తున్న ప్రభాస్!!

ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో సినిమా ఆడేస్తుంది అనుకుని సాహో సినిమాని పెద్దగా ప్రమోట్ చేసుకోలేదు. సినిమా మొదలైనప్పటినుండి సాహో కి ఇంత బడ్జెట్ అవుతుంది.. [more]

Update: 2020-06-18 06:05 GMT

ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో సినిమా ఆడేస్తుంది అనుకుని సాహో సినిమాని పెద్దగా ప్రమోట్ చేసుకోలేదు. సినిమా మొదలైనప్పటినుండి సాహో కి ఇంత బడ్జెట్ అవుతుంది.. ఆ యాక్షన్ ఎపిసోడ్ అలా, ఆ ఫన్నీ ఎపిసోడ్ ఇలా, దుబాయ్ అబుదాబి ఎపిసోడ్ కె కోట్లు ఖర్చయ్యింది అంటూ దుబాయ్ మీడియాలో న్యూస్ లు రావడం తప్పించి ఆ సినిమాని మొదటినుండి ప్రమోషన్స్ విషయంలో గాలికి వదిలేసారు. సాహో విడుదలకు ముందు అంటే ఓ 15 రోజుల ముందు ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగి హడావిడి ప్రమోషన్స్ చేసి సినిమా కలెక్షన్స్ పై దెబ్బేసుకున్నారు. బాహుబలి క్రేజ్ ఉంది సాహో కి ప్రమోషన్స్ ఎందుకనుకున్నారో ఏమో..కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి ప్రభాస్ కి దిమ్మతిరిగేలా  చేసింది.

అంత జరిగినా ప్రభాస్ అండ్ టీం కి ఇంకా బుద్ది వచ్చినట్టుగా లేదు.అందుకే రాధాకృష సినిమా ప్రమోషన్స్ లోను, టైటిల్ విషయంలోనూ ఇంకా మీనా మేషాలు లెక్కెడుతున్నారు. చాలా వరకు షూటింగ్ అయిన సీన్స్ లో నుండి సినిమా ఫస్ట్ లుక్ గాని, సినిమా టైటిల్ గాని విడుదల చెయ్యడం పెద్ద విషయమేమి కాదు. కానీ రాధాకృష్ణ – ప్రభాస్ – నిర్మాతలు యూవీ వారు మాత్రం ఇంకా సినిమా ప్రమోషన్స్ విషయంలో సిద్దమవలేదు. ప్రభాస్ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. ఫాన్స్ గోల అని కాదు గాని.. పాన్ ఇండియా మూవీకి ఏ లెవల్ ప్రమోషన్ కావాలి. సాహో, సై రా సినిమాల విషయంలో అంత ఎక్సపీరియెన్స్ వున్నా ప్రభాస్ మాత్రం ఇంకా మారలేదు. సాహో విషయంలో చేసిన తప్పే ప్రభాస్ రాధాకృష్ణ మూవీ విషయంలోనూ చేస్తుండడం ప్రభాస్ ఫాన్స్ కి రుచించడం లేదు. సినిమాలు మొదలైనప్పుడే టైటిల్స్, ఫస్ట్ లుక్స్ తో పోటీ పడుతున్నారు హీరోలు.. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టినా సినిమాకి ఇంకా ఫస్ట్ లుక్ ఇవ్వలేదంటే ఇలాగె అంటారు మరి.

Tags:    

Similar News