టాలీవుడ్ హీరోలకు ర్యాంక్స్ వేసిన ప్రభాస్

Update: 2018-12-24 08:22 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు టాలీవుడ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరితో సరదాగా ఉండే ప్రభాస్ రీసెంట్ గా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు.. రాజమౌళి, రానా కూడా వెళ్లారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ప్రభాస్ చాలా ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు. టాలీవుడ్ లో హీరోస్ కి ర్యాంకులు ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. కానీ ప్రభాస్ ఎటువంటి మోహవటం లేకుండా ర్యాంకులు ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్, చరణ్, బన్నీలకు ర్యాంకులు ఇవ్వాలంటే ఇవ్వరికి ఇస్తారు అని కరణ్ అడిగితే వెంటనే ప్రభాస్ ఏమి ఆలోచించకుండా ర్యాంకులు ఇచ్చాడు.

డేటింగ్ కాదు.. ఫ్రెండ్ షిప్ మాత్రమే

తారక్ ఫస్ట్... మహేష్ సెకండ్... బన్నీ థర్డ్... చరణ్ ఫోర్త్ అని ర్యాంకులు ఇచ్చాడు. ప్రభాస్ - ఎన్టీఆర్ మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. గోపిచంద్ తో కాకుండా మల్టీ స్టారర్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే ఎన్టీఆర్ తోనే అని గతంలోనే చాలాసార్లు చెప్పాడు. ఈ షోలో ప్రభాస్ బద్దకంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అనుష్కతో మీరు డేటింగ్ చేస్తున్నారు కాదా అని ఆడితే అదేం లేదు అని ప్రభాస్ అనడం... రానాని... మీరు త్రిషతో ఇదివరకు డేటింగ్ చేశారు అని అడిగితే తమ మధ్య లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది తప్ప లాంగ్ డేటింగ్ లేదని రానా చెప్పుకొచ్చాడు. అలా ఈ షోలో చాలానే డిస్కషన్స్ జరిగాయి.

Similar News