ప్రభాస్ ఓవర్సీస్ రేంజ్ అది

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా మూవీస్ తో ఎనలేని క్రేజ్, ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ మీద భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీ [more]

Update: 2021-05-01 10:17 GMT

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా మూవీస్ తో ఎనలేని క్రేజ్, ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ మీద భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీ అవ్వడమే కాదు.. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంది. బాహుబలి బ్లాక్ బస్టర్ తో సాహో సినిమా కి విపరీతమై బజ్ రాగా.. ఆ సినిమా నార్త్ లో హిట్ కొట్టింది. సౌత్ ప్రేక్షకులకి ఎక్కలేదు. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ పై భారీ క్రేజ్ ఉంది. ప్రభాస్ – పూజా హెగ్డే కాంబోలో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ మూవీపై మంచి అంచనాలున్నాయి.
ఆ అంచనాలతోనే యువి క్రియేషన్స్ వారు ఆ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు. అలాగే ఆ సినిమాకి మంచి మార్కెట్ ఉంది. గతంలో సాహో విషయంలో యువి వారు తప్పటడుగు వేసి కొన్ని ఏరియాస్ ని ఉంచుకుని డైరెక్ట్ గా విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు. కానీ ఈసారి మంచి బేరం వస్తే రాధేశ్యామ్ ని విక్రయించేస్తున్నారు. అందులో భాగంగా రాధేశ్యామ్ ఓవర్సీస్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందట. ఓవర్సీస్ బడా డిస్ట్రిబ్యూటర్స్ రాధేశ్యామ్ హక్కుల కోసం పోటీ పడుతున్నారట. అయితే రాధేశ్యామ్ డిమాండ్ ని బట్టి ఓవర్సీస్ హక్కులు 3.5 మిలియన్ డాలర్ల నుండి 4 మిలియన్ డాలర్ల వరకు అమ్ముడు పోవచ్చని టాక్. మరి ఈ రేంజ్ బిజినెస్ అంటే ప్రభాస్ క్రేజ్ ఓవర్సీస్ లో ఎంతగా ఉందో అర్ధమవుతుంది. కరోనా క్రైసిస్ లోను రాధేశ్యామ్ కి ఈ మేర బిజినెస్ జరగడం మాములు విషయం కాదు.

Tags:    

Similar News