ప్రభాస్ ఫాన్స్ కి పూనకలొచ్చే న్యూస్?

ప్రభాస్ వరసబెట్టి సినిమాలు ప్రకటిస్తూ ప్రబస్ ఫాన్స్ కి పిచ్చ హ్యాపీ చేస్తున్నాడు. ఎప్పుడూ చాల స్లో గా ఉండే ప్రభాస్ తాజాగా వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. [more]

Update: 2020-09-08 03:39 GMT

ప్రభాస్ వరసబెట్టి సినిమాలు ప్రకటిస్తూ ప్రబస్ ఫాన్స్ కి పిచ్చ హ్యాపీ చేస్తున్నాడు. ఎప్పుడూ చాల స్లో గా ఉండే ప్రభాస్ తాజాగా వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న ప్రభాస్ జిమ్ లో బాగా వర్కౌట్స్ చేస్తున్నాడు. తాజాగా తనకి ఎంతో హెల్ప్ చేస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న తన జిమ్ ట్రైనర్ కి ప్రభాస్ 20 లక్షల విలువచేసే కార్ ప్రెజెంట్ చేసాడు. అయితే ప్రబస్ రాధేశ్యాం షూటింగ్ కోసం సమాయత్తమవుతున్న తరుణంలో రాధేశ్యాం దర్శకుడు ప్రభాస్ పై ఓ ట్వీట్ వేసాడు.

నేను నా డార్లింగ్ తో సినిమా చేయడమనేది నా డ్రీం. సెట్‌ లో ప్రభాస్ తో కలిసి చేస్తుంటే సంపూర్ణమైన గొప్ప ఆనందం. ఆయనతో వర్క్ చాల హ్యాపీ గ ఉంటుంది. వచ్చే ఏడాది ఖచ్చితంగా థియేటర్లలో మనం రాధేశ్యాం సినిమా చూస్తాం. రాధే శ్యామ్ లో డార్లింగ్ ప్రభాస్ లుక్స్ సినిమాకే అతిపెద్ద ప్రధాన ఆకర్షణ అవుతుంది అంటూ సినిమాపై రాధాకృష్ణ అంచనాలు పెంచేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుంది అనే ప్రచారం ఉండగా.. ఈ సినిమా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా చెబుతున్నారు. ఈ నెల రెండో వారం నుండి ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుంది.

Tags:    

Similar News