ప్రభాస్ తో పూరి సినిమా నిజమేనా?

ఒకప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ పెద్దపెద్ద హీరోస్ తోనే సినిమాలు చేసేవాడు. చిన్న హీరోస్ ని  పటించుకునేవాడు కాదు. టెంపర్ సినిమా తరువాత పూరి కి సరైన హిట్ [more]

Update: 2019-09-13 07:20 GMT

ఒకప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ పెద్దపెద్ద హీరోస్ తోనే సినిమాలు చేసేవాడు. చిన్న హీరోస్ ని పటించుకునేవాడు కాదు. టెంపర్ సినిమా తరువాత పూరి కి సరైన హిట్ లేకపోవడంతో అతనితో సినిమా చేయడానికి చిన్న హీరోస్ భయపడే రేంజ్ కి వెళ్ళిపోయాడు అంటే అతని స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో ఆలోచించవచ్చు. రామ్ లాంటి చిన్న హీరో తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ఇది హిట్ అయితే పూరి మళ్లీ బ్యాక్ టు ఫార్మ్ అవుతాడు.

అది హిట్ అయ్యిందంటే…..

విజయ్ సినిమా హిట్ అయితే ప్రభాస్ పూరి తో చేయడానికి రెడీ అంట. ప్రభాస్ పూరితో ఎప్పటినుంచో ఓ మూవీ చేయాలనుకుంటున్నాడు. కానీ పూరికి సరైన హిట్ లేకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తీసే సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ప్రభాస్ చేస్తాడు. మహేష్ తో పూరి జ‌న‌గ‌ణ‌మ‌న‌ అనే సినిమా చేయాల్సివుంది కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఆ మూవీని ప్రభాస్ తో తీయాలనుకుంటున్నాడు పూరి. గతంలో వీరి కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ సినిమాలొచ్చాయి.

మూడు నెలల్లో మొదలు….

ఆ సినిమాలు నిరాశపరిచినా ప్రభాస్ మాత్రం పూరి తో సినిమా చేయాలనుకుంటున్నాడు. అది కూడా విజయ్ సినిమా హిట్ అవుతూనే. విజయ్ తో పూరి సినిమా రెండుమూడు నెలల్లో స్టార్ట్ అవ్వనుంది. ఇది కంప్లీట్ అయిన తరువాత ప్రభాస్ తో సినిమా ఉండే అవకాశముంది.

 

 

Tags:    

Similar News