ప్రభాస్ సినిమా టైటిల్ అమూర్ కాదు... మరో టైటిల్ అంట..!

Update: 2018-10-11 09:01 GMT

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ చేస్తూనే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ మూవీలోనూ నటిస్తున్నాడు. సాహో సినిమా గత ఏడాది మొదలైతే.. జిల్ రాధాకృష్ణ సినిమా ఈ మధ్యనే పట్టాలెక్కింది. రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ పక్కన మొదటిసారి పూజ హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గా అమూర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. అమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అని అర్ధం అంటూ ప్రచారం ఒక రేంజ్లో జరిగింది.

టైటిల్ రిజిస్టర్ చేయించిన నిర్మాతలు...

అయితే తాజాగా ప్రభాస్ 20వ సినిమాకి టైటిల్ అమూర్ కాదని...జాన్ అనే వేరొక టైటిల్ ని ఫైనల్ చేశారన్నటాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. అయితే జాన్ అనేది తాను లవర్ ని పిలుచుకునే పిలుపు అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇక జాన్ అనే టైటిల్ ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పలు భాషల్లో తెరకెక్కడం తో సినిమాపై అప్పుడే అంచానాలు మొదలైపోయాయి. యువి క్రియేషన్స్ - గోపికృష్ణ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Similar News