ప్రభాస్ న్యూ లుక్.. వైరల్!!

ప్రభాస్ నిన్నటివరకు లుక్ విషయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేసాడు. నిన్న మొన్నటివరకు ప్రభాస్ బాగా బరువు పెరిగి, వయసు పెరిగిన లుక్ తో ప్రభాస్ లుక్స్ [more]

Update: 2020-11-26 05:07 GMT

ప్రభాస్ నిన్నటివరకు లుక్ విషయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేసాడు. నిన్న మొన్నటివరకు ప్రభాస్ బాగా బరువు పెరిగి, వయసు పెరిగిన లుక్ తో ప్రభాస్ లుక్స్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పడినాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా కోసం బాహుబలి పాత్ర కోసం బాగా బరువు పెరిగాడు. ఆ పాత్ర వెయిట్ అలాంటిది. కాబట్టే ప్రభాస్ వెయిట్ పెరిగాడు. అంతకుముందు మిర్చి సినిమాలో సూపర్ స్టయిలిష్ గా ఉండే ప్రభాస్ బాహుబలి పాత్రకి బరువు పెరిగి సూపర్ పర్ఫెక్ట్ అనిపించాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో, బరువు విషయంలో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. బాగా బరువు పెరిగిన ప్రభాస్.. తర్వాత ఎంతగా జిమ్ చేసి, వర్కౌట్ చేసి, సాహసాలు చేసినా బరువు తగ్గలేదు. ప్రభాస్ లుక్స్ కాస్త ఏజెడ్ లుక్స్ ని తలపించడంతో ఆయన ఫాన్స్ కూడా కంగారు పడ్డారు.

అయితే ప్రభాస్ ఇప్పుడు ఆ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడుతున్నాడు. ఆదిపురుష్ కోసం వెయిట్ తగ్గాడో లేదంటే మారేదన్నానో కానీ.. ఫాన్స్ కి సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ కోసం సూపర్ మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే జిమ్ చేస్తున్న ప్రభాస్ బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు.. విమర్శకుల నోళ్లు మూతపడేలా ఉంది. మిర్చి సినిమాలో ప్రభాస్ ఎలా ఉన్నాడో.. ప్రభాస్ తాజా లుక్ లో అలా అంత స్టైలిష్ గా ఉన్నాడు. సన్నగా స్టైలిష్ గా, కూల్ గా కనబడుతున్న ప్రభాస్ ని చూస్తే ఆదిపురుష్ కోసం ఎంతగా హోమ్ వర్క్ చేసాడో అనిపిస్తుంది.

Tags:    

Similar News