అబ్బే.. ఇది అస్సలు చాలదు సాహో

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా ఈ నెల 30 న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన [more]

Update: 2019-08-08 05:58 GMT

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా ఈ నెల 30 న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా గ్రాఫిక్స్ వర్క్ వలన ఆగస్టు తొలి వారంలో విడుదల కావాల్సిన సినిమా కాస్త.. ఆగస్టు 30 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక సాహో ప్రమోషన్స్ కూడా ఇంకా సరిగ్గా పక్కాగా మొదలవ్వలేదు. రోజుకో సాంగ్, రోజుకో పోస్టర్ విడుదల చేస్తే సినిమాకి క్రేజ్ వచ్చేయదు. సాహో సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో సాహో సినిమా ప్రమోషన్స్ ఎలా ఉన్నప్పటికీ… బాలీవుడ్ లో మాత్రం సాహో సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. బాలీవుడ్ నటులను తీసుకుంటే.. అక్కడ సాహో కి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుందనుకున్నారు సాహో టీం సభ్యులు. మరి హిందీ సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే మూడు నెలల ముందు నుండే ఆ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో మొదలవుతున్నాయి. ఎంతటి స్టార్ హీరో హీరోయిన్ అయినా… స్పెషల్ ఇంటర్వూస్ లాంటివి ఇవ్వకుండా సినిమా టీం తో కలిసి ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరవుతారు.

ఇలా అయితే ఎలా…?

కానీ ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడో ఇంకా అర్ధం కాడం లేదు. తాజాగా సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరపబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఇక ఆగష్టు 10 న సాహో ట్రైలర్ వదులుతారట. మరి బాలీవుడ్ ప్రమోషన్స్ పీక్స్ లో లేకపోతే అక్కడి ప్రేక్షకులు సినిమాని ఏం చేస్తారో తెలియదు. రాజమౌళి బాహుబలి విషయంలో పక్కా ప్లానింగ్ తో అక్కడి బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సహాయంతో బాహుబలి ప్రమోషన్స్ చేసాడు. అందులోనూ బాహుబలి మీద అప్పట్లో అన్ని భాషల ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పటి సాహో మీద హిందీలో అంతగా భారీ అంచనాలేమి లేవు. అందులోను ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలైన బడా స్టార్స్ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవడంతో.. ఓ తెలుగు సినిమా మాత్రం ఏం చేస్తుందిలే అనే ఆలోచనతో ఉన్నారు. మరి శ్రద్ద కపూర్ తో పాటుగా సాహో లో నటించిన బాలీవుడ్ నటులతో ప్రచారం ఓ రేంజ్ లో అంటే… సాహో సినిమా విడుదలకు ముందు రెండ్రోజులకో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తే… సాహో మీద బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ పెరుగుతుంది. ఇలా రోజుకో పోస్టర్ వదిలితే మాత్రం సరిపోదు.

Tags:    

Similar News