ప్రభాస్ పెళ్లి మేటర్ డైవర్ట్!

Update: 2018-10-26 08:04 GMT

టాలీవడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతాడా...? అంటే అందరి మొహంలోనూ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ పుట్టిన రోజుకైనా ప్రభాస్ పెళ్లి విషయంపై స్పందిస్తాడు అని అందరూ ముందు నుండే హడావిడి చేశారు. పెళ్లి వయసు దాటిపోయి పదేళ్లయినా ప్రభాస్ పెళ్లి మేటర్ మాత్రం మీడియాకి ఇంకా ఎడతెగని న్యూస్ కిందే మిగిలిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లన్నారు. కానీ సాహో సినిమా కూడా పూర్తవడానికి సిద్ధంగా వుంది. అయినా ప్రభాస్ పెళ్లి విషయం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ పుట్టినరోజుకైనా పెళ్లి వార్త వింటామని అందరూ అనుకుంటే ప్రభాస్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. అక్టోబర్ 23న పుట్టినరోజు ముందు వరకు ప్రభాస్ గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని.. పుట్టినరోజునాడే ప్రభాస్ పెళ్లి విషయమై ప్రకటన వస్తుందనే న్యూస్ లు కోకొల్లలుగా చక్కర్లు కొట్టాయి.

మరి పెళ్లెప్పుడు చేసుకుంటాడు...

కానీ ప్రభాస్ ఫాన్స్ కి సాహో సినిమా వీడియోతో కడుపు నిండిపోయింది. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేశారు. సుజిత్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్ లో సాహో చిత్రం తెరకెక్కుతుంది. అయితే ప్రభాస్ నలభయ్యో పుట్టిన రోజు కానుకగా సాహో మేకింగ్ వీడియోని వదిలారు. ఆ మేకింగ్ వీడియో చూసాక సాహో సినిమాని హాలీవుడ్ రేంజ్ తో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంకేమిటి ఆ సాహో వీడియోలో మునిగిపోయిన వారంతా ప్రభాస్ పెళ్లి విషయాన్నీ పక్కన పెట్టేసారు. అసలు ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడో గాని.. ప్రభాస్ పెళ్లి విషయంలో రకరకాల గాసిప్స్ మాత్రం సోషల్ మీడియాలో రోజుకొకటి పుడుతూనే ఉంది. ఏది ఏమైనా సాహో సినిమా మేకింగ్ వీడియో హడావిడిలో ప్రభాస్ పెళ్లి మేటర్ మాత్రం మరుగున పడిందనే చెప్పాలి.

Similar News