బాబూ.... ప్రభాసు.. ఇప్పటికైనా క్లారిటీ ఇస్తావా..!

Update: 2018-09-27 07:36 GMT

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ప్రభాస్ పెళ్లి వార్తపై ఈ మధ్యన మీడియాలో రోజుకో వార్త ప్రసారంపై అవుతోంది. అయినా ప్రభాస్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో మీడియా నిన్నమొన్నటి వరకు ప్రభాస్ పెళ్లి విషయంలో రోజుకో వార్త వండి వార్చింది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై మరో న్యూస్ సోషల్ మీడియా, ఫిలింసర్కిల్స్ లో చక్కర్లుకొడుతుంది. ప్రభాస్ పెళ్లిపై ఒక ముఖ్య ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఆ వార్త సారాంశం. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న ఆయన కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుంటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

త్వరలోనే పెళ్లి వార్త...

అదేమిటంటే, ప్రభాస్ పెళ్లి వార్తను అభిమానులకు వెల్లడించనున్నారని సమాచారం. ప్రభాస్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభాస్ పెళ్లి ముచ్చట్లకు ఫుల్ స్టాప్ ఆయన కుటుంబ సభ్యులు పెడతారో.. లేదంటే ఇది కూడా గాలి వార్తేనా అనేది మాత్రం ప్రభాస్ పుట్టినరోజునే క్లారిటీ వస్తుంది. ఇకపోతే ప్రభాస్ యువి క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో శ్రద్ద కపూర్ తో, జిల్ ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రంలో పూజ హెగ్డే తో నటిస్తున్నాడు.

Similar News