సెట్టింగ్స్ కోసం సినిమా ఆలస్యం..!

ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. బాహుబలి విడుదలై రేపు వచ్చే ఏప్రిల్ కి రెండేళ్లు పూర్తవుతుంది. బాహుబలి సినిమా విడుదలప్పుడే [more]

Update: 2019-02-21 06:35 GMT

ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. బాహుబలి విడుదలై రేపు వచ్చే ఏప్రిల్ కి రెండేళ్లు పూర్తవుతుంది. బాహుబలి సినిమా విడుదలప్పుడే సాహో సినిమా టీజర్ తో షో టైం అన్న ప్రభాస్ ఇప్పటివరకు సాహో సినిమాని విడుదల చెయ్యలేదు. ఆగష్టు 15న సాహో విడుదల అంటూ ప్రకటించారు. భారీ గ్రాఫిక్స్ తో భారీగా తెరకెక్కుతున్న సాహో చిత్రం హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కిస్తుండంతో సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంది. భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ వలన సాహో షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఇక ఎలాగైనా ఆగష్టు 15 న ఈ సాహో విడుదలకు సుజిత్ ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే సాహో చిత్రం పలు భాషల్లో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతున్నది.

రెండు సినిమాలు ఏకే ఏడాది అనుకున్నా…

ఇక సాహోతో పాటుగా ప్రభాస్ జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డేతో కలిసి మరో లవ్ అండ్ రొమాంటిక్ మూవీలో నటిస్తున్నాడు. సాహో షూటింగ్ జరుగుతుండగానే.. ఆ చిత్ర షూటింగ్ ని మొదలెట్టేసిన ప్రభాస్ ఇప్పటికే రాధాకృష్ణ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసాడు. ఇక ఈ సినిమా కూడా నేషనల్ వైడ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యి.. విడుదవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యని ప్రభాస్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో సందడి చేస్తాడని అనుకున్నారు.

వచ్చే ఏడాదే…

కానీ జిల్ రాధాకృష్ణ మూవీ కూడా లేట్ అయ్యి వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే విడుదలకు ఛాన్సెస్ ఉన్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే నేషన్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భారీ సెట్టింగ్స్ అవసరమవుతున్నాయట. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆ భారీ సెట్టింగ్స్ వేయడానికి చాలా సమయం పడుతుందట. అందుకే ఆ సెట్టింగ్స్ వేసి షూటింగ్ అవీ చేసే సరికి ఎలా లేదన్నా ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఏడాదిన్నర సమయం పట్టేలా ఉందని అందుకే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విదులయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News