ప్రభాస్ ట్యూషన్ కి వెళుతున్నాడట..!

అదేమిటి ప్రభాస్ ట్యూషన్ కి వెళ్ల‌డ‌మేమిటా అనుకుంటున్నారా… మరి ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తే ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఆ భాష మీద పట్టు [more]

Update: 2019-05-15 05:16 GMT

అదేమిటి ప్రభాస్ ట్యూషన్ కి వెళ్ల‌డ‌మేమిటా అనుకుంటున్నారా… మరి ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తే ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఆ భాష మీద పట్టు సాధించాలి అంటే ఆ మాత్రం నేర్చుకోవాలి కదా. అందుకే ప్రభాస్ ఒక భాష నేర్చుకోవడానికి ఒక టీచర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడట. మరి సాహో సినిమాతో ఇండియా వైడ్ గా దిగబోనున్న ప్రభాస్ ఆ చిత్రం కోసం హిందీ నేర్చుకుంటున్నాడట. గతంలో బాహుబలి కూడా బాలీవుడ్ లో విడుదలైంది. కానీ అప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ కి వేరే వారు హిందీ డబ్బింగ్ చెప్పారు. కానీ ఈసారి సాహో విషయంలో ప్రభాస్ హిందీ నేర్చుకుని మరీ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు.

తానే డ‌బ్బింగ్ చేప్పుకునేందుకు

బాహుబలి విషయంలో వీలు కాలేదు కానీ.. ఇప్పుడు సాహోలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి అని.. హిందీ నేర్చుకోవడానికి సోనీ అనే టీచర్ ని పెట్టుకున్నట్లుగా ప్రభాస్ చెబుతున్నాడు. మరి సోని టీచర్ దగ్గర హిందీ ట్యూషన్ చెప్పించుకుని సాహోకి హిందీలో డబ్బింగ్ చెప్పెయ్యడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హిందీ భాషలో పట్టు సాధించానని చెబుతున్నాడు. త్వరలోనే సాహోలో తన పాత్రకి హిందీ డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని చెబుతున్నాడు. అన్నట్టు సాహో సినిమా వరల్డ్ వైడ్ గా ఆగష్టు 15న విడుదల కాబోతుంది.

Tags:    

Similar News