హిట్ కొట్టాలంటే ప్రభాస్ కావాలంటున్నాడు

Update: 2018-11-26 03:23 GMT

ప్రస్తుతం హీరో గోపీచంద్ ప్లాప్స్ తో కొట్టుమిట్టాడు తున్నాడు. వరస పరాజయాలతో ఉన్నప్పటికీ.. సినిమాల మీద సినిమాలు చేసుకుపోతున్న గోపీచంద్ కి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే... అతను ప్రభాస్ అని అందరికి తెలుసు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి వర్షం సినిమాలో నాయకుడు, ప్రతి నాయకుడు కింద నటించారు. అయితే ఆ తర్వాత ప్రభాస్ స్టార్ హీరో అయితే... గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన గోపీచంద్ కి కాలం అస్సలు కలిసి రావడం లేదు.

ప్రస్తుతం గోపీచంద్ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. మరోపక్క ప్రభాస్ సాహో సినిమాతోనూ, జిల్ రాధాకృష్ణ మూవీ షూటింగ్ తోనూ బిజీ అయ్యాడు. అయితే గోపిచంద్ కి ఎన్ని సినిమాలు చేసినా... ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా చెయ్యాలనే కోరిక ఉందట. ఇది గోపీచంద్ కి తీరని కోరిక అంటున్నాడు. ప్రభాస్ తో కలిసి గోపీచంద్ ఒక సినిమా చెయ్యాలనుకున్నాడట. మరి గోపీచంద్ దానికి రెడీగా ఉన్నప్పటికీ.. ప్రభాస్ ఇంటర్నేషనల్ సినిమాల్తో బాగా బిజీగా ఉంటున్నాడు. ప్రభాస్ కూడా స్నేహితుడు గోపీచంద్ తో కలిసి ఒక సినిమా చెయ్యాలనుందని ఎప్పుడో చెప్పాడు.

మరి గోపీచంద్ కోరికను ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో అనేది ప్రస్తుతం సస్పెన్స్. మరి మంచి కథ దొరికితే గోపీచంద్, ప్రభాస్ లను ఒకే సినిమాలో చూడొచ్చన్నమాట. ఇక ప్రభాస్, గోపీచంద్ లను కలిపే ఆ కథ ఎలా ఉంటుందో... మరి అవీరిద్దరి కాంబోని సెట్ చేసి సినిమా తీసే ఆ దర్శకుడెవరో అంటూ అప్పుడే హాట్ హాట్ చర్చలు ఫిలింసర్కిల్స్ లో మొదలైపోయాయి. మరి ప్రభాస్ తో సినిమా చేస్తే అయినా గోపీచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Similar News