ప్రభాస్ ఫాన్స్ హార్ట్ అవుతున్నారుగా?

ప్రభాస్ బాహుబలి కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసిన ఫాన్స్ కి రాజమౌళి ఎప్పటికి మరిచిపోలేని గిఫ్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందించడం ప్రభాస్ ని [more]

Update: 2020-04-08 05:41 GMT

ప్రభాస్ బాహుబలి కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసిన ఫాన్స్ కి రాజమౌళి ఎప్పటికి మరిచిపోలేని గిఫ్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందించడం ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చెయ్యడం జరిగింది. బాహుబలి కోసం ఎదురు చూసిన.. వారికీ తగిన ఫలితం దక్కింది. ఇక సాహో కోసం ప్రభాస్ అలానే ఫాన్స్ ని తెగ వెయిట్ చేయించాడు. కానీ సాహో దెబ్బ మాములుగా తగల్లేదు. ఇక సాహో పూర్తయ్యాక రాధాకృష్ణ రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ .. ఆ సినిమా విషయంలో ఆచి తూచి ఫాన్స్ ని వెయిట్ చేయిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ చూద్దామా.. ఎప్పుడెప్పుడు ప్రభాస్ కొత్త టైటిల్ విందామా అన్న ఫాన్స్ కి అడుగడుగునా నిరాశే అన్నట్టుగా ఉంది. కరొనతో లాక్ డౌన్. లాక్ డౌన్ తో ప్రభాస్ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

దానితో రాధే శ్యాం సినిమా అప్ డేట్ కి అడ్డం పడింది. తాజాగా రాధాకృష్ణ కూడా ఫాన్స్ ని ఉసూరుమనిపించేసాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నాము. కరోనా వైరస్ నుండి విముక్తి పొందిన తర్వాత మల్లీ మీ ముందుకు ఫ్రెష్ అప్ డేట్స్ తో వస్తాం. అంటూ ప్రభాస్ ఫాన్స్ ని దర్శకుడి రాధా కృష్ణ నిర్మాతలు యువి వారు కలిసి హార్ట్ చేసారు. ప్రభాస్ అప్ డేట్ కోసం ఫాన్స్ ఎంతో ఆతృతగా ఉంటె… ఇలా కరోనా వైరస్ ప్రభాస్ ఫాన్స్ అసలు మీద నీళ్లు చల్లింది.

Tags:    

Similar News