ఇంటర్వెల్ కోసం మరీ అంత?

ప్రస్తుతం సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ మరింత అంచనాలు పెంచేసింది. ఈసినిమా క్రేజ్ ఏంటో [more]

Update: 2019-03-09 06:43 GMT

ప్రస్తుతం సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ మరింత అంచనాలు పెంచేసింది. ఈసినిమా క్రేజ్ ఏంటో రీసెంట్ గా అమ్ముడైన ఓవర్సీస్ రైట్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ అప్డేట్ షాక్ కు గురిచేస్తోంది.

భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నారని అందరికి తెలిసిందే. దాదాపు 225 కోట్లు తో ఈచిత్రం ను డైరెక్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. దుబాయ్ లో ఆమధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ నిపుణుల సహకారంతో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో చాప్టర్ 1 టీజర్ లో చూసాం. ఇప్పుడు ఇంటర్వెల్ ఎపిసోడ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేశారట. కేన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఇంటర్వెల్ ఎపిసోడ్ ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తారని సమాచారం.

అయితే ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక్కదానికే 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇంటర్వెల్ కోసమే ఇంత ఖర్చు పెడుతున్నారని షాక్ అవుతున్నారు. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఇది కంప్లీట్ అయితే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయినట్టే. ఆగష్టు లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News