ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని ఆపేసాడు!

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ పర్లేదు అనిపిస్తుంది. లాంగ్ వీకెండ్ లో ఈమూవీ రిలీజ్ అవ్వడం దీనికి ప్లస్ అయింది.ఓపెనింగ్స్ తో [more]

Update: 2019-09-07 06:58 GMT

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ పర్లేదు అనిపిస్తుంది. లాంగ్ వీకెండ్ లో ఈమూవీ రిలీజ్ అవ్వడం దీనికి ప్లస్ అయింది.ఓపెనింగ్స్ తో మొదటి మూడునాలుగు రోజుల్లో కలెక్షన్స్ తో దున్నేసింది ఈమూవీ. కానీ ఐదొ రోజు నుంచి దీని పరిస్థితి అర్ధం అయిపోయింది.ప్రభాస్ కు హిందీ లో మంచి క్రేజ్ ఉండడంతో అక్కడ ఈమూవీ బతికి బట్ట కట్టినా కానీ మిగిలిన చోట్ల మాత్రం దారుణంగా ఫెయిలయ్యింది.ముఖ్యంగా తమిళ, మలయాళ భాషలలో డిజాస్టర్‌ అయింది ఈమూవీ.

ఎందుకాపారంటే….

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ కూడా భారీ నష్టం తప్పదనిపిస్తోంది. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ లాంటి డైరెక్టర్ పై ఇంత పెద్దసినిమా పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అతను అర్ధం కాని స్క్రీన్ ప్లే తో రెగ్యులర్ స్టోరీ తో సినిమా తీసాడు. దాని ఫలితమే ఇది.అందుకే ప్రభాస్‌తో పాటు యువి క్రియేషన్స్‌ వాళ్లు కూడా అలర్ట్‌ అయ్యారు. జిల్ లాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ తో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కొంచం షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాను సాహో రిజల్ట్ సరిగా రాకపోవడంతో ఆపేసారు.

క్రేజ్ ను కొనసాగించేందుకు…

మరోసారి ఆ సినిమా కథపై కసరత్తులు చేసి ఫ్రెష్‌గా జనవరి నుంచి షూట్‌కి వెళ్తారు. ఈలోగా ప్రభాస్ తన లుక్ పై ఫోకస్ పెట్టనున్నాడు. హిందీ లో తనకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని పాడు చేసుకోకుండా ఈ క్రేజ్‌ని ఇలాగే కొనసాగించేలా సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News