ప్రభాస్ సూపర్ హీరోగా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో హీరోయిన్ గా పూజా [more]

Update: 2020-05-09 09:47 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో హీరోయిన్ గా పూజా నటిస్తుంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విభిన్నమైన కథతో ఓ చిత్రం రూపొందుతుంది. దీన్ని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నట్టు అర్ధం అవుతుంది.

ఇక ఈమూవీ తరువాత వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ – కరణ్ జొహార్ కలిసి నిర్మించనున్నారని అంటున్నారు. అయితే కథ, డైరెక్టర్, మిగిలిన నటీనటులు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటువంటి ప్రాజెక్ట్ ని ఎవరు హేండిల్ చేస్తారనేది చూడాలి. ఇక ఈమూవీ తెలుగు ..  తమిళ ..  మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.2020 లో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

Tags:    

Similar News