ప్రభాస్ లాంటి వాడే కావాలి కానీ...?

Update: 2018-07-20 02:57 GMT

టాలీవుడ్ లో హిట్ ఫెయిర్ గా పేరు సంపాదించిన అనుష్క - ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ గత నాలుగైదేళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉంది. వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను జంటగా మారతారని... అసలు ప్రభాస్, అనుష్కలు డీప్ లవ్ లో ఉన్నారని... ప్రభాస్ అనుష్కని ఇష్టపడబట్టే.. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని... అలాగే అనుష్క కూడా ఇంత వయసొచ్చిన ప్రభాస్ కోసం ఉండిపోయిందని.. ఇలా ఎన్నో రకాల న్యూస్ మీడియాలో నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి. ఇక ఈ పెళ్లి వార్తలకు అనుష్క, ప్రభాస్ లు ఎన్నిసార్లు ఫుల్ స్టాప్ పెడదామని ట్రై చేసినా.. అది మాత్రం జరగడం లేదు. మేమిద్దరం స్నేహితులమే కానీ, ప్రేమికులం కాదని ఎవరి స్టయిల్లో వారు చెప్పినా ఆ పెళ్లి వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు.

ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలి అంటే... అటు ప్రభాస్ గాని.. ఇటు అనుష్కలు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికి ప్రభాస్ గాని, అనుష్క గాని పెళ్లి మాట ఎత్తడం లేదు. మరి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ కోసం సంబంధాలు వెతుకుతున్నాడు. మధ్యలో ప్రభాస్ ఏమన్నా చిన్న పిల్లోడా.. పెళ్లి చేసుకో చేసుకో అని ఎన్నిసార్లు చెబుతాం అంటాడు. ఇక ప్రభాస్ ఏమో బాహుబలి సీరీస్ అవ్వగానే పెళ్లి అన్నవాడు కాస్తా... ఇప్పుడు సాహో సినిమా షూటింగ్ ఒక కొలిక్కి రావాలంటున్నాడు. ఇక అనుష్క కోసం ఆమె పేరెంట్స్ పెళ్లి కొడుకుల్ని చూస్తున్నారని.. అందుకే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశ్యంతోనే అనేక దేవాలయాలు తిరుగుతున్నారని అంటున్నారు.

తాజాగా అనుష్క అమ్మగారు ప్రభాస్ - అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే అనే విషయం మీద స్పందిస్తూ.. ప్రభాస్, అనుష్క లు పెద్ద స్టార్స్. వారిద్దరూ కలిసి అనేక సినిమా ల్లో జోడీలుగా నటించారు. అందుకే వాళ్ళ మీద ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇక అనుష్క కోసం ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ కావాలనే ఉంది. కానీ ప్రభాస్ లాంటి కుర్రాడు అనుష్క కి దొరకాలి. ఇక ప్రభాస్, అనుష్కలు మంచి స్నేహితులు మాత్రమే.. ఇప్పటికైనా వారి పెళ్లి విషయంలో వస్తున్న రూమర్స్ ఆపాలని అనుష్క తల్లి కోరారు. ఇక అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా... ప్రభాస్ సాహో షూటింగ్ తోనూ, రాధాకృష్ణ డైరెక్షన్ లో మరో మూవీ తోనూ బిజీగా ఉన్నాడు

Similar News