బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

బాలకృష్ణ.. తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనౌన్స్ చేసి మరీ ఆ సినిమాని పక్కనబెట్టి మరో దర్శకుడితో తన కొత్త సినిమాని [more]

Update: 2019-05-12 07:37 GMT

బాలకృష్ణ.. తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనౌన్స్ చేసి మరీ ఆ సినిమాని పక్కనబెట్టి మరో దర్శకుడితో తన కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. జై సింహతో యావరేజ్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మాతగా మొదలు పెట్టబోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ఫ్లాప్స్ తర్వాత బోయపాటితో మళ్లీ సినిమా చేస్తే వర్కౌట్ అవదని.. కె.ఎస్.రవికుమార్ తో సినిమా తలపెట్టాడు. ఈ సినిమాలో లెజెండ్ సినిమాలో తనతో పోటాపోటీకి నటించిన జగపతి బాబు విలన్ గా నటించబోతున్నాడని టాక్ ఉంది. హీరోయిన్ గా హరిప్రియ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఎన్టీఆర్ పాటలోని లిరిక్ తో

ఇక జై సింహ టీం మళ్లీ బాలయ్య కొత్త చిత్రానికి పనిచెయ్యబోతోందని ప్రచారం జరుగుతుండగా… ఇప్పుడు బాలయ్య – రవికుమార్ సినిమా టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అది కూడా బాలకృష్ణ అన్న కొడుకు ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలోని ఒక పాటకి సంబంధించిన లిరిక్ ని టైటిల్ గా పెట్టబోతున్నారట. ఎన్టీఆర్ – బోయపాటి కాంబోలో వచ్చిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ రూలర్ అంటూ మహారాజు వేషంతో ఒక పాట పడుతాడు. ఇప్పుడు ఆ రూలర్ అనే పదాన్ని బాలయ్య తన సినిమా టైటిల్ గా ఓకె చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బాల‌య్య ఓ లంచ‌గొండి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని.. అందుకే రూలర్ అనే టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో సి.క‌ల్యాణ్ ఈ పేరుని రిజిస్ట‌ర్ చేయించారట.

Tags:    

Similar News