ఫైటర్ స్టోరీ అది కాదట!

రామ్ తో ఇస్మార్త్ శంకర్ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ పూరి వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తునట్టు ప్రకటించారు. ప్రస్తుతం [more]

Update: 2019-09-12 09:11 GMT

రామ్ తో ఇస్మార్త్ శంకర్ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ పూరి వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తునట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా కథ ఇదే అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అది నిజం కాదని తెల్సింది.

లవ్ స్టోరీతో…..

ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తన ప్రేమ కోసం ఆ యువకుడు ఏం చేసాడనేదే సినిమా పాయింట్ అట. దీన్ని తనదైన శైలితో తెరకెక్కించనున్నాడు పూరి. ఇక ఈమూవీ కి ‘ఫైటర్’ అని టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని మరో టాక్.

ఆ హీరోయిన్లకే ఛాన్స్….

ఇందులో హీరోయిన్స్ కోసం ఆల్రెడీ కొంతమంది ని సెలెక్ట్ చేసుకున్నాడు పూరి. వారిలో ఎవరిని ఫైనల్ చేస్తాడో మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఆ హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చే అవకాశముంది. ఈమూవీ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో ఎవరు నటిస్తారో….

 

 

 

Tags:    

Similar News