శేఖర్ కమ్ముల సినిమా వాయిదా చైతు హ్యాపీ

శేఖర్ కమ్ముల, నాగచైతన్య సినిమా నెల రోజుల కిందట అఫీషియల్ గా ప్రారంభమైంది. సినిమా ఓపెనింగ్ అప్పుడే ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని [more]

Update: 2019-10-11 07:15 GMT

శేఖర్ కమ్ముల, నాగచైతన్య సినిమా నెల రోజుల కిందట అఫీషియల్ గా ప్రారంభమైంది. సినిమా ఓపెనింగ్ అప్పుడే ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న డేట్ కి రాలేకపోతున్నారు టీం. షూటింగ్ లేట్ అవ్వడం వల్ల సినిమా వాయిదా పడింది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. వాస్తవానికి డైరెక్టర్ శేఖర్ ఈ సినిమాకు సంబంధించి చాలా షూటింగ్ కంప్లీట్ చేశారు.

సమయం సరిపోదని….

నాగ చైతన్య – సాయి పల్లవిని హీరో హీరోయిన్స్ గ్రాఫిక్స్ అవ్వక ముందు కొత్త హీరో హీరోయిన్లతో శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టార్ట్ చేసేశాడు. ఇప్పుడు వారి ప్లేస్ లో చైతు అండ్ పల్లవి వచ్చారు. సో…దాని వల్ల కొంత భాగం షూటింగ్ అయితే కంప్లీట్ అయింది కానీ ఇప్పుడు నవంబర్ నాటికి పూర్తవ్వడం కష్టంగా మారింది. అందుకే సినిమాను వాయిదా వేశారు. ఇలా జరగడం వల్ల చైతు కి కలిసొచ్చింది. ఎందుకంటే వెంకిమామ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ శేఖర్ కమ్ముల సినిమా వెంకిమామ రెండు సినిమాలు డిసెంబర్ లో వస్తే చైతు కి ఇబ్బందిగా మారేది. సో ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.

 

 

Tags:    

Similar News