శర్వాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది..!

Update: 2018-12-20 08:32 GMT

శర్వానంద్ - సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి అంచనాలున్న పడి పడి లేచే మనసు సినిమా మీద శర్వా భారీ ఆశలే పెట్టుకున్నాడు. హను రాఘవపూడి గత చిత్రం లై సినిమా డిజాస్టర్ అయినా... హనూని నమ్మి ప్రేమ కథ చిత్రాన్ని చేసిన శర్వా ఈ సినిమా విజయంపై మంచి ధీమాతో ఉన్నాడు. అలాగే ప్రమోషన్స్ లో ఈ సినిమా పక్కా హిట్ అని చెబుతున్నాడు. ప్రమోషన్స్ తోనూ సినిమా మీద మంచి అంచనాలు పెంచేసిన శర్వానంద్ నమ్మకాన్ని పడి పడి లేచే మనసు నిలబెట్టే లాగే కనబడుతుంది.

ఫస్ట్ హాఫ్ సూపర్ అంట...

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ పడి పడి లేచే మనసు ఫస్ట్ హాఫ్ సూపర్ అంటున్నారు. పడి పడి లేచే మనసు ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ గా, శర్వానంద్ - సాయి పల్లవిల మధ్య మంచి కెమిస్ట్రీ నడిచిందని... ఆ జంట మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయంటున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ మాత్రమే కాదు ఫస్ట్ హాఫ్ సాంగ్స్ కూడా ఇరగదీశాయట. ఫస్ట్ హాఫ్ సూపర్ అయితే సెకండ్ హాఫ్ యావరేజ్ అయినా సినిమాకి హిట్ పడిపోతుంది. మరి ఈ ఫీడ్ బ్యాక్ తో శర్వా అప్పుడే సగం హిట్ కొట్టేసాడు. చూద్దాం మరికొన్ని గంటల్లో విడుదల కాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది.

Similar News