జబర్దస్త్ కి పోసాని ఎంట్రీ చాలా చప్పగా ఉందిగా

నాగబాబు ఎగ్జిట్ తో వారానికో జేడ్జ్ మారుతున్న జబర్దస్త్ షో ఇప్పుడు రెండో జేడ్జ్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జబర్దస్త్ ని రోజా ఏదో [more]

Update: 2019-12-30 10:04 GMT

నాగబాబు ఎగ్జిట్ తో వారానికో జేడ్జ్ మారుతున్న జబర్దస్త్ షో ఇప్పుడు రెండో జేడ్జ్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జబర్దస్త్ ని రోజా ఏదో ఓ కుర్ర హీరోతో నడిపించేస్తుంటే…. ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాత్రం అలీ, పోసాని లాంటి వారు వెళ్లి గెస్ట్ జేడ్జ్ లుగా కొనసాగుతున్నారు. అయితే అలీ కానీ పోసాని కానీ జడ్జ్ గా అస్సలు మెప్పించడం లేదు. ఫెక్ నవ్వుతో వారు రోజా ముందు తేలిపోతున్నారు. ఇక నాగబాబు అదిరింది షో లో జబర్దస్త్ ని కాపీ కొడుతున్నాడనే ప్రచారం ఉండడమే కాదు.. ఇప్పటివరకు జరిగిన రెండు అదిరింది ఎపిసోడ్స్ చూస్తుంటే పాత జబర్దస్త్ స్కిట్స్ చూస్తున్నట్టుగానే ఉంది. ఇక జబర్దస్త్ లో రష్మీ, అనసూయ హాట్ హాట్ గా చంపెయ్యడమే కాదు… అవసరమైతే రోజా పక్కన జేడ్జ్ లుగా మారుతున్నారు. కానీ అదిరింది షో లో సమీరా ఎంత హాట్ గా కనబడదామనుకున్నప్పటికీ.. అనసూయ, రష్మిల ముందు తేలిపోవడమే కాదు.. అసలు సమీరా యాంకరింగ్ లో అంత పస కనిపించడం లేదు.

అయితే అదిరింది షో కీ ఎన్ని మైనస్ లు ఉన్నాయో.. నాగబాబు వెళ్ళాక జబర్దస్త్ షో కి అన్నే మైనస్ లు కనబడుతున్నాయి. స్కిట్స్ లో పట్టు లేదు.. కామెడీలో అంతగా పస లేకపోయినా రోజా మాత్రం 10/10 ఇచ్చేస్తూ మా స్కిట్స్ గొప్పగా ఉన్నాయని నాగబాబు ని రెచ్చగొడుతుంది. నాగబాబు లేక కాస్త డల్ ఉన్న టైం లో టీమ్‌లను నిరాశ పరచడం ఇష్టం లేక… 10కి 10 ఇచ్చేస్తున్నారు. దాంతో… 25 వేల ప్రైజ్ మనీ… అన్ని టీమ్‌లకూ దక్కుతోంది. దీనితో టీం లీడర్స్ మా స్కిట్స్ గొప్ప అంటే గొప్ప అనుకుని.. కొత్త కొత్త పంచ్ లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేకాకుండా జబర్దస్త్ షోలో ఇప్పుడు కొత్త వారు ఎంట్రీ, చాలామంది తమ ఫామిలీస్ తో స్కిట్స్ లాగించేయడం కూడా జబర్దస్త్ కి ఫ్యూచర్ లో దెబ్బ పడే ప్రమాదముందని అంటున్నారు. మరో పక్క జేడ్జ్ గా పోసాని ఏమంతగా ఎట్రాక్ట్ గా లేడని.. కాస్త ఆక్టివ్ పర్సనాలిటీని జేడ్జ్ గా తీసుకుంటే బావుండు అనే సలహాలిస్తున్నారు.

Tags:    

Similar News