పోసాని కి చేసిన ఆప‌రేష‌న్ ఫెయిల్ ?

ప్రముఖ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి రైటర్ గా చాలా సినిమాలకు పని చేసి డైరెక్టర్ గా సినిమాలు చేసి అవిఏమి సక్సెస్ అవ్వకపోవడంతో సైడ్ ఆర్టిస్ట్ [more]

Update: 2019-07-12 07:23 GMT

ప్రముఖ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి రైటర్ గా చాలా సినిమాలకు పని చేసి డైరెక్టర్ గా సినిమాలు చేసి అవిఏమి సక్సెస్ అవ్వకపోవడంతో సైడ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తనదైన శైలి లో నటించడంతో పోసాని కి ఇంకా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పోసాని 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న వైకాపా త‌ర‌పున ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ తరువాత ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఆయనకు రీసెంట్ గా హెర్నియా ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. అయితే పాపం ఆ ఆప‌రేష‌న్ కాస్తా ఫెయిల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఆప‌రేష‌న్ జ‌రిగిన చోట ఇన్‌ఫెక్ష‌న్ వ్యాపించిన‌ట్టు స‌మాచారం. దాంతో పోసాని మళ్లీ హాస్పిటల్ లో చేరినట్టు సమాచారం.

మళ్లీ ఆయనకు మరోసారి హెర్నియా ఆప‌రేష‌న్ జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయనను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవ్వ‌బోతున్న‌ట్టు స‌న్నిహితులు తెలిపారు. యాక్టీవ్ గా ఉండే పోసాని ఒక్కసారిగా ఇలా అయిపోవడం కొంచం బాధించే విషయమే. ఆయన త్వరగా కోలుకుని తిరిగి మనల్ని ఎంటర్టైన్ చేయాలనీ కోరుకుంద్దాం.

Tags:    

Similar News