అతను నా లవర్ కాదు..

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. బాలీవుడ్ లో క్రేజీగా పేరుతెచ్చుకుంటున్న పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అది ఏ సినిమానో క్లారిటీ ఇవ్వకుండా ఓ [more]

Update: 2020-04-07 08:07 GMT

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. బాలీవుడ్ లో క్రేజీగా పేరుతెచ్చుకుంటున్న పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అది ఏ సినిమానో క్లారిటీ ఇవ్వకుండా ఓ తమిళ సినిమ మాత్రం 2020 లో చేస్తా అంటుంది. అయితే పూజ హెగ్డే బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉందని… అతనితో త్వరలోనే పెళ్లిపీటలెక్కే ఛాన్స్ ఉందని.. కానీ పూజ హెగ్డే ఆ ఎఫ్ఫైర్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది అని మాములుగా ప్రచారం జరగడం లేదు.. మరి మేడం పూజ హెగ్డే నిజంగానే బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రా కొడుకు రోహాన్ మెహ్రాతో లవ్ లో ఉందని అందరూ ఫిక్స్ అవుతుంటే.. పూజ హెగ్డే మాత్రం తూచ్ అంటుంది.

నేను రోహన్ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని.. రోహన్ పూజ హెగ్డే కలిసి ఉన్నప్పుడు కొంతమంది ఫొటోస్ తీసి ఇలాంటి రూమర్స్ సృష్టించారు. కానీ పూజ నిజంగానే రోహన్ తో ప్రేమలో ఉందని ప్రచారం జోరుగా జరగడంతో పూజ హెగ్డే లైన్ లోకొచ్చి.. మేము మంచి ఫ్రెండ్స్ కానీ లవర్స్ మాత్రం కాదు.. అంటూ అందరిలా కబుర్లు చెబుతుంది. ప్రస్తుతం సినిమాల్తో బిజీగా ఉన్న నేను ప్రేమలో పడేంత తీరిక లేదంటూ కబుర్లు చెబుతుంది.

Tags:    

Similar News