హీరోయిన్స్ సోషల్ మీడియా రగడ?

ప్రస్తుతం టాలీవుడ్ లో బాలయ్య చేసిన హాట్ కామెంట్స్ కి సి కళ్యాణ్, నాగబాబు లాంటి సినీ పెద్దలు కౌంటర్లు ఇస్తుంటే… ఇండస్ట్రీ మొత్తం వేడి వేడిగా [more]

Update: 2020-05-30 06:38 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో బాలయ్య చేసిన హాట్ కామెంట్స్ కి సి కళ్యాణ్, నాగబాబు లాంటి సినీ పెద్దలు కౌంటర్లు ఇస్తుంటే… ఇండస్ట్రీ మొత్తం వేడి వేడిగా ఉంది. ఇలాంటి టైం లోనే ఇద్దరు హీరోయిన్స్ ఫాన్స్ మధ్యన చిచ్చు రేగింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరువలో ఉన్న పూజ హెగ్డే తన ట్విట్టర్ లో సమంత పై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ని పూజ హెగ్డే తన ట్విట్టర్ లో మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో సమంత అంత అందంగా ఏం లేదని.. అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదంటూ పోస్ట్ చెయ్యడంతో సమంత భిమానులు రెచ్చిపోయి పూజ హెగ్డే పై పడ్డారు.

అయితే ఇదంతా చూసిన పూజ హెగ్డే మిడ్ నైట్ టైం లో నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది అని.. తన టెక్నీకల్ టీం దాన్ని సరిచేస్తున్నారని, కాబట్టి ఎవరూ నా అకౌంట్ ని ఫాలో అయ్యి పర్సనల్ పోస్ట్ లు పెట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. అలాగే మరో గంటలో తన సోషల్ మీడియా టీం తన అకౌంట్ ని హ్యాకర్స్ నుండి కాపాడింది అని.. చెప్పింది కానీ.. ఎక్కడా సమంత పేరుని ప్రస్తావించడం కానీ, తానూ సమంతపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదని మాట్లాడకపోయే సరికి సమంత అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. అంతేకాకుండాసమంత ఫ్రెండ్స్ నందిని రెడ్డి, చిన్మయి సమంత ని ఉద్దేశించి.. వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ…, ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్ అంటూ ట్వీట్ చెయ్యడం దానికి సమంత కూడా జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్ కౌంటర్ వెయ్యడంతో ఇవన్నీ పూజ హెగ్డే ని ఉద్దేశించి చేసినవే అంటూ పూజ ఫాన్స్ సమంత మీద ఫైర్ అవుతున్నారు. మరి పూజ క్షమాపణ చెప్పాలని సమంత ఫాన్స్, కాదు సమంత క్షమాపణ చెప్పాలని పూజ ఫాన్స్ సోషల్ మీడియాని ఆడేసుకుంటున్నాడు. 

Tags:    

Similar News