మహర్షి లో పూజా.. శ్రీమంతుడు శృతి

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి. మహేష్ – పూజా నటిస్తున్న ఈసినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతుంది. ఇందులో అల్లరి నరేష్ [more]

Update: 2019-02-08 10:21 GMT

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి. మహేష్ – పూజా నటిస్తున్న ఈసినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతుంది. ఇందులో అల్లరి నరేష్ ఓ ప్రేత్యేక పాత్ర లో కనిపించనున్నాడు. ప్రస్తుతం డబ్బింగ్ స్టార్ట్ చేసిన ఈసినిమా ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులు ఈసినిమా ఇలా ఉండబోతుంది..అలా ఉండబోతుందని రకరకాలు వార్తలు వస్తున్నాయి.

ఇక రీసెంట్ గా హీరోయిన్ పూజా తన ఇంస్టాగ్రామ్ లో ఇచ్చిన లైవ్ లో తన పాత్ర ఎలా ఉండబోతుందని ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఆమె పట్టణ ప్రాంతానికి సంబందించిన అమ్మాయిగా కనిపించనుంది. అలానే తన పాత్ర కొంచం ఫన్నీ గా, కొంటెగా, కొంచం అమాయకత్వంగా ఉండబోతుందని స్పష్టం చేసింది. అయితే ఇక్కడే తేడా కొడుతుంది.

సరిగా ఇటువంటి పాత్రే శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ చేసింది. ఆమె ఉండటానికి సిటీ లో ఉన్న ఒక మారుమూల గ్రామం నుంచే వస్తుంది. మరో పక్క ఈసినిమాలో శ్రీమంతుడు షేడ్స్ ఉంటాయని సినీ వర్గాల టాక్. మరి ఈసినిమా వీటిని ఎలా ఓవర్ కం చేస్తుందో చూద్దాం.

Tags:    

Similar News