ప్రభాస్ జాన్ లో పూజ పాత్ర ఇదే

సాహో తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం జాన్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సాహో యాక్షన్ ఎంటర్టైనర్ [more]

Update: 2019-09-26 08:36 GMT

సాహో తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం జాన్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సాహో యాక్షన్ ఎంటర్టైనర్ కాగా జాన్ ఏమో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇది పీరియాడిక్ మూవీ అని 1960ల కాలంలో యూరోప్ లో జరిగిన ఓ అందమైన లవ్ స్టోరీ కథ అని ఆమధ్య ప్రభాస్ చెప్పాడు. ఇక ఇందులో తొలిసారి ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యూరోప్ టీచర్ వచ్చేస్తున్నారు…..

ఈ మూవీలో ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ఫైట్స్ అలాంటివి ఏమి ఉండవు . ఇది పక్కా లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ లో పూజ పాత్ర గురించి ఒక ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే ఇందులో ఆమె ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుండదట. యూరోప్ లో టీచర్ ఎలా ఉంటారో..అలానే 1960 కాలంలో ఎలా ఉంటారో అలా ఉండబోతుంది అంట పూజ. ఆల్రెడీ ఈమెపై కొంతవరకు షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి అధికారంగా ప్రకటన లేనప్పటికీ కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులు మాత్రం నిజమే అంటున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

 

Tags:    

Similar News