పూజ పై ఈ రూమర్ నిజమేనా?

తెలుగులో అల్లు అర్జున్ ‘డిజె’ తో పరిచయం అయినా హాట్ బ్యూటీ పూజ హెగ్డే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. వరసగా టాలీవుడ్ స్టార్స్ తో నటిస్తున్న పూజ [more]

Update: 2019-09-09 09:44 GMT

తెలుగులో అల్లు అర్జున్ ‘డిజె’ తో పరిచయం అయినా హాట్ బ్యూటీ పూజ హెగ్డే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. వరసగా టాలీవుడ్ స్టార్స్ తో నటిస్తున్న పూజ ప్రస్తుతం ప్రభాస్ కొత్త మూవీతో పాటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంటపురంలో’ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెల్సిందే.

పూజ పద్దతి మార్చుకోవాల్సిందేనా..?

రీసెంట్ గా పూజ పై ఓ కంప్లైంట్ వచ్చింది. ఆమె సరిగా షూటింగ్ కి రావడంలేదని, చాలా లేట్ గా షూటింగ్ కి వస్తుందని, మధ్యాహ్నం భోజన సమయానికి కూడా బయటకు వెళ్లి షూటింగ్ కి మళ్ళీ చాలా ఆలస్యంగా వస్తుందని, దీనివల్ల సినిమా లేట్ అవుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి.

ఇలా చేస్తే అంతే….

నిజానికి ఈమూవీ సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. కానీ పూజ ఇలా లేట్ చేయడం వల్ల ఈమూవీ అనుకున్న టైం కి రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. అసలే ఈమూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు పూజ వల్ల ఇంకా లేట్ అయితే కష్టమే. ఏది ఏమైనా పూజ తన వైఖరి మార్చుకోకపోతే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

 

.

Tags:    

Similar News