హీరోయిన్ కాకపోయుంటే…!!

ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కోసం జార్జియా వెళ్లొచ్చిన పూజ హెగ్డే.. కరోనా ప్రభావంతో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్ళింది.. నిన్నటికి.. 14 రోజుల హోమ్ క్వారంటైన్ [more]

Update: 2020-04-03 08:58 GMT

ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కోసం జార్జియా వెళ్లొచ్చిన పూజ హెగ్డే.. కరోనా ప్రభావంతో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్ళింది.. నిన్నటికి.. 14 రోజుల హోమ్ క్వారంటైన్ ని ముగించుకుని… బయటికి వచ్చింది. అయితే ప్రస్తుతం అఖిల్ సినిమాతోనూ, ప్రభాస్ సినిమాతోనూ బిజీగా ఉన్న పూజ హెగ్డే తాజాగా ఓ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తుంది.. మీరు ఫోటో షూట్స్, సినిమా షూటింగ్స్ మిస్ అవుతున్నారా అని అడిగితె… అంతే కదండీ… ఎపుడు బిజీగా వుండే వారికీ ఖాళీగా ఉండే ఏం తోస్తుంది.. సెట్స్ లో ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే ఈ కరోనా కాలాన్ని తిండి.. నిద్ర, టివి చూడడంతోనే కాలక్షేపం చేసేస్తున్నా అని చెబుతుంది.

ఇక మీరు గనక హీరోయిన్ కాకపోయుంటే ఏమవుదురు అని అడగగా. దానికి పూజ హెగ్డే ఏ డాక్టరో… లేదంటే… ఇంకేదన్నానో అని సమాధానం చెబుతుంది అనుకుంటే..దానికి పూజ హెగ్డే స్టైలిస్ట్ కానీ.. లేదంటే ఫోటో గ్రాఫేర్ కానీ అవుదామనుకున్నా అంటుంది. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్ స్టయిల్ అండ్ యాక్టింగ్ అంటే ఇష్టమని… ఇక సల్మాన్ ఖాన్ తో చెయ్యబోయే సినిమా విషయంతో చాలా ఎగ్జైటింగ్ గా వున్నానని చెబుతుంది. ఇక పూజ హెగ్డే కి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్ తో కలిసి నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోని మనసా మానస సాంగ్ ఇష్టమని చెబుతుంది. ఇక ప్రస్తుతం వర్కౌట్స్ తోనూ… బాగా తిని నిద్రపోతూ కరోనా టైం ని స్పెండ్ చేస్తున్నట్లుగా చెబుతుంది పూజ హెగ్డే.

Tags:    

Similar News