పూజ ఏం చెయ్యాలనుకుంటుంది

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ చైర్ లో ఉన్న పూజ హెగ్డే స్టార్ హీరోలందరికీ బెస్ట్ ఆప్షన్. అందుకే ఏ సినిమా మొదలెట్టినా పూజ హెగ్డే పేరే వినబడుతుంది. [more]

Update: 2019-12-07 05:44 GMT

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ చైర్ లో ఉన్న పూజ హెగ్డే స్టార్ హీరోలందరికీ బెస్ట్ ఆప్షన్. అందుకే ఏ సినిమా మొదలెట్టినా పూజ హెగ్డే పేరే వినబడుతుంది. ఒకప్పుడు రకుల్ లా ఇప్పుడు పూజ హెగ్డే స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాల్తో యమా బిజీ. మరోపక్క బాలీవుడ్ లో హౌస్ ఫుల్ తో ప్లాప్ కొట్టి.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకోవడంతో.. ఇప్పుడు పూజ పేరు బాలీవుడ్ లోను వినబడుతుంది. ఇక ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్ సినిమాల్తో బిజీ అయినా పూజ హెగ్డే కి బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట.

అయితే పూజ హెగ్డే మాత్రం ఇపుడు కొత్తగా కమిట్ అయ్యే సినిమాల విషయంలో ఆచి తూచి ఆలోచన చేస్తుందట. తనదగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు చాలా నెమ్మదిగా ఈ విషయాన్నీ చెబుతూ.. సారీ చెబుతుందట. మంచి సినిమాలు, కథా బలమున్న సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయిన పూజ హెగ్డే తనవద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు సున్నితంగా చెప్పి తిప్పి పంపుతుందట. మరి ఇప్పటివరకు పూజ హెగ్డే పై ఎక్కడా ఎటువంటి రిమార్కు లేదు. అందరితో కలిసిపోయే పూజ హెగ్డే మీద పారితోషకం పెంచింది అనే ప్రచారం అజరిగినా… క్రేజ్ ఉన్నకాడే…డిమాండ్ ఉంటుంది అనే సామెతని అందరూ తెలుసుకోవాలి.

Tags:    

Similar News