హరీష్ సెంటిమెంటా… పూజ అదృష్టమా?

హరీష్ శంకర్, అల్లు అర్జున్ తో డీజే సినిమా అనుకున్నప్పుడు.. ప్లాప్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకుని.. పిచ్చి పని చేసాడనుకున్నారు. [more]

Update: 2020-02-07 06:23 GMT

హరీష్ శంకర్, అల్లు అర్జున్ తో డీజే సినిమా అనుకున్నప్పుడు.. ప్లాప్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకుని.. పిచ్చి పని చేసాడనుకున్నారు. కానీ పూజ డీజే సినిమాలో బికినీ గ్లామర్ తో రెచ్చిపోయి.. అదరగొట్టింది. సినిమా హిట్ లో భాగస్వామి అయ్యింది. ఇక హరీష్ శంకర్ వరుణ్ తో తెరకెక్కించిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాలో పూజ హెగ్డే ని గెస్ట్ రోల్ అంటూ సెకండ్ హాఫ్ లో చూపించడమే కాకుండా…. పూజ తో తీసిన వెల్లువొచ్చే గోదారమ్మ.. సాంగ్ తో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈసారి హరీష్ శంకర్ పూజ హెగ్డే తో సెంటిమెంట్ ముడిపెట్టి.. పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఫ్రెష్ స్టోరీ తో సినిమా చేస్తున్నా అని… ఈసారి ఏ సినిమాని రీమేక్ చెయ్యడం లేదని ఈమధ్యనే హరీష్ క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే సెంటిమెంట్ తో హీరోయిన్ ని హరీష్ రిపీట్ చేస్తున్నాడంటున్నారు.

మరో పక్క హారిష్ సెంటిమెంట్ ఏమో కానీ.. పూజ హెగ్డే లక్కునే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతున్న పూజ హెగ్డే.. ఓ రెండేళ్లలో స్టార్ హీరోస్ అయినా మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లను చుట్టేసింది. మరి నిజం గా లక్కీ కాకపోతే.. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అయ్యాక పూజకి పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ అంటే మాములు విషయం కాదు… నిజంగా హరీష్ సెంటిమెంట్ అంటూ పూజ హెగ్డే ని లక్కీ గర్ల్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తప్ప మిగతా హీరోలందరిని చుట్టేసిన పూజ ఇప్పుడు పవన్ తో సినిమా అంటే అమ్మడు అదృష్టం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.

Tags:    

Similar News