సినిమా పూర్తవ్వక ముందే మోసేస్తుందిగా

ప్రస్తుతం తెలుగులో టాప్ రేంజ్ హీరోయిన్ గా ఒక్క పూజ హెగ్డే నే కనబడుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో పూజ తప్ప వేరే ఆప్షన్ దర్శకనిర్మాతలకు కనిపించడం [more]

Update: 2019-11-27 07:18 GMT

ప్రస్తుతం తెలుగులో టాప్ రేంజ్ హీరోయిన్ గా ఒక్క పూజ హెగ్డే నే కనబడుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో పూజ తప్ప వేరే ఆప్షన్ దర్శకనిర్మాతలకు కనిపించడం లేదు. అందుకే పూజ హెగ్డే కి అల అలా బంపర్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో నటిస్తున్న పూజ హెగ్డే ,ప్రభాస్ తో జాన్ సినిమాలోనూ నటిస్తుంది. బాహుబలి రేంజ్ ప్రభాస్ తో పూజ సినిమా అంటే మరి పూజ గాల్లో తేలడం ఖాయం. ఇప్పుడు పూజ, ప్రభాస్ ని ఆకాశానికెత్తేస్తుంది. అబ్బా అల్లు అర్జున్ తో ఇంకా సినిమా పూర్తవ్వకముందే ప్రభాస్ ని మోసేస్తుందిగా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు.

తాజాగా పూజ హెగ్డే అమెరికా వెళ్ళినప్పుడు కొంతమంది ప్రేక్షకులల్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఇండియా నుండి వచ్చాననగానే.. ప్రభాస్ ల్యాండ్ నుండి వచ్చారా అని అడిగారని, ప్రభాస్ బాహుబలి మ్యానియా అలా ఉందని, ప్రభాస్ బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని చెబుతుంది. ప్రభాస్ అంటే చాలా కూల్ గా ఉండే వ్యక్తి అని, నేను ప్రభాస్ లాంటి హీరోని ఇంతవరకు చూడలేదని, ప్రభాస్ చాల మంచి వ్యక్తని తెగ పొగిడేసింది. మరి పూజ హెగ్డే, ప్రభాస్ ని పొగడడం బాగానే ఉంది. ఇంకా ప్రభాస్ తో తానూ చేస్తున్న సినిమా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా, ఈ సినిమాలో ప్రభాస్ యూరోపియన్ స్టయిల్ లో కనిపిస్తాడు అంటూ సినిమాలోనూ ప్రభాస్ కేరెక్టర్ ని రివీల్ చేసేసింది.

Tags:    

Similar News