పూజా ఎక్కడున్నావమ్మా..?

డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయిన పూజా హెగ్డే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు దక్కించుకుని బాగా [more]

Update: 2019-01-25 10:16 GMT

డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయిన పూజా హెగ్డే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు దక్కించుకుని బాగా బిజీ అయ్యింది. స్టార్ హీరోలను చక్కబెట్టే పనిలో క్షణం తీరిక లెని పూజ హెగ్డే పేరు మీడియాలో మాములుగా మార్మోగలేదు. డీజే సినిమాలో వేసిన బికినీ కాకతో దర్శకనిర్మాతలంతా పూజా హెగ్డే వెంట పడ్డారు. డీజే తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సామెత సినిమాలో నటించింది. ఆ సినిమా యావరేజ్ హిట్ అందుకుంది. ఇక అరవింద సామెతలో టైటిల్ రోల్ పోషించిన అరవిందగా పూజా హెగ్డేకి ఓ అన్నంత పేరు రాలేదు. ఆ సినిమా మొత్తం ఎన్టీఆర్ భూజస్కంధాల మీదే నడిచింది. టైటిల్ కి తగ్గ క్యారెక్టర్ ను త్రివిక్రమ్ పూజాకి ఇవ్వలేదు. ఇక ఆ సినిమాలో పెద్దగా పేరు తెచ్చుకోలేని పూజా హెగ్డే ఆ తర్వాత మళ్లీ పెద్దగా వార్తల్లో లేదు. మహేష్.. మహర్షి షూటింగ్ తో పాటుగా… ప్రభాస్ – రాధాకృష్ణల సినిమాల్లో బిజీ కావడమే కాదు… మరోపక్క బాలీవుడ్ లోనూ హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది.

వారి తర్వాత పూజనే…

అయితే స్టార్ హీరోలందరికీ సమంత, కాజల్, తమన్నా, అనుష్కల తర్వాత బెస్ట్ ఆప్షన్ గా నిలిచిన ఏకైక హీరోయిన్ గా పూజా హెగ్డెనే నిన్నమొన్నటి వరకు కనబడింది. అను ఇమ్మాన్యువల్, రాశి ఖన్నా లాంటి హాట్ హీరోయిన్స్ వరస డిజాస్టర్స్ తో ఉండడంతో… స్టార్ హీరోల కన్ను పూజా మీదే పడేది. ఇక పూజా బిజీ అయిన టైం లో మహేష్ కియరా అద్వానీని బాలీవుడ్ నుండి దింపాడు. కియరా నటించిన భరత్ అనే నేను యావరేజ్ కాగా.. లేటెస్ట్ వినయ విధేయ రామ ప్లాప్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో కియరా అద్వానీ పేరు గట్టిగానే వినబడింది.

కొత్త లుక్ బయటకు వస్తేనే…

మరి ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ చిత్రాల్లో బుక్ అయిన పూజ మళ్లీ అల్లు అర్జున్ సరసన నటించేందుకు పనికి రాదనుకున్నారో లేదంటే.. పూజా బిజీగా ఉంది కియరాతో అడ్జెస్ట్ అవుదామనుకున్నారో.. కానీ పూజా పేరు మాత్రం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాకి పరిశీలించనే లేదు. మొన్నీమధ్య వరకు పూజా హెగ్డే సూపర్, లక్కీ అన్న వారే ఇప్పుడు పూజా పేరు పెద్దగా ఉచ్చరించడం లేదు. మరి అమ్మడు నటిస్తున్న మహర్షి లుక్ లో కానీ, ప్రభాస్ – జిల్ రాధాకృష్ణల సినిమాలోని లుక్ తో కానీ పూజా దర్శనమిస్తే తప్ప ఆమె పేరు మళ్లీ మీడియాలో హైలెట్ అయ్యేలా కనబడటం లేదు.

Tags:    

Similar News