దోబూచులాడుతున్న పూజా హెగ్డే..!

Update: 2018-07-06 07:13 GMT

అల్లు అర్జున్ 'డీజే' సినిమా ఎలా ఉందో పక్కన పెడితే అందులో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే రేంజ్ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పాలి. అందులో బికినీ వేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న పూజ లేటెస్ట్ గా 'రంగస్థలం' సినిమాలో జిగేలు రాణి అంటూ ఐటెం సాంగ్ తో చెలరేగి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం' సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ కూడా దగ్గరలో ఉంది.

స్కిన్ షోలో త‌గ్గ‌ట్లేదుగా...

అంతే కాకుండా ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ'తో పాటు మహేష్ - వంశీ పైడిపల్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇవే కాకుండా మరో రెండుమూడు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. ఇన్ని అవకాశాలు చేతిలో ఉన్న స్కిన్ షో చేయటం విషయంలో ఆమె ఏ మాత్రం తగ్గట్లేదు. తన క్లీవేజ్ ని చూపించి చూపించనట్టుగా పైన ఉన్న స్టిల్ కు దర్శనం ఇచ్చింది పూజా.

రెమ్యూన‌రేష‌న్‌ పెంచేసి...

ఈ స్టిల్ చూస్తుంటే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో హృతిక్ సరసన 'మొహేంజాదారో' లో నటించిన పూజా తర్వాత తెలుగులో వరుణ్ తేజ్ సరసన 'ముకుందా'తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఎక్కువ గ్లామర్ పాత్రలే చేసిన పూజా ఐటెం సాంగ్ చేయాలంటే 70 లక్షలు.. సినిమా చేయాలంటే కోటికిపైగా తీసుకుంటుందంట.

Similar News