పూజ ఈసారి ఫ్యూజులు ఎగరగొడుతుందట!!

పూజ హెగ్డే కి నటన రాదు.. కేవలం గ్లామర్ తోనే హడావిడి చేసి.. అవకాశాలు కొట్టేస్తుంది.. నటన ఇంకా  నేర్చుకోవాలని పూజ పై సోషల్ మీడియాలో ప్రచారం [more]

Update: 2020-07-28 10:56 GMT

పూజ హెగ్డే కి నటన రాదు.. కేవలం గ్లామర్ తోనే హడావిడి చేసి.. అవకాశాలు కొట్టేస్తుంది.. నటన ఇంకా నేర్చుకోవాలని పూజ పై సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నప్పటికీ… ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే క్రేజ్ పీక్స్ లో ఉంది. టాప్ వన్ ఎవరనగానే పూజ హెగ్డే అంటారు. అంతలా పూజ హెగ్డే లక్కీగా స్టార్స్ హీరోస్ సినిమా అవకాశాలు పట్టేస్తుంది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్న పూజ హెగ్డే ప్రభాస్ రాధేశ్యాం పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఇకపోతే పూజ ఎప్పుడు కోపం గానో, లేదంటే నవ్వుతూనే కనబడింది కానీ.. కామెడి చేస్తూ పెద్దగా కనబడలేదు.

అయితే తాజాగా పూజ హెగ్డే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లో స్టాండప్ కామెడీ చెయ్యబోతుందట. బొమ్మరిల్లు భాస్కర్ పూజ హెగ్డే కేరెక్టర్ ని చాలా కమెడిగా రాయడమే కాదు.. ఆమె పాత్ర నుండి కామెడీ పంచ్ లు పేల్చబోతున్నారట. స్టాండప్ కామెడీ అనేది సోషల్ మీడియాలో బాగా కనబడుతుంది. తెలుగు వారికీ పెద్దగా పరిచయం లేని కామెడీ అది. అయితే బాలీవడో లో స్టాండప్ కామెడీ హైలెట్ అవుతుంది. కదలకుండా ఉన్న చోటే నించుని తాము చెప్పే మాటల్తో.. నవ్వించాలి. మరి పూజ హెగ్డే స్టాండప్ కామెడీ అఖిల్ సినిమాలో ఎలా చెయ్యబోతుందో వెయిట్ అండ్ వాచ్. వెయిట్ ఎందుకు అంటే కరోనా మహమ్మారి తగ్గాలి.. బ్యాలెన్స్ షూట్ పూర్తి చెయ్యాలి.. సినిమా థియేటర్స్ లోకి రావాలే. అది సంగతి.

Tags:    

Similar News