ఆయన అనుభవం ముందు మనమెంత?

టాలీవుడ్ టాప్ రేంజ్ లో దూసుకెళుతున్న పూజ హెగ్డే కి తెలుగులో తిరుగులేదు. ఇంతవరకు సౌత్ సినిమాలైనా తెలుగులోనే హవా నడిపించిన పూజ హెగ్డే త్వరలోనే తమిళ [more]

Update: 2020-04-13 10:46 GMT

టాలీవుడ్ టాప్ రేంజ్ లో దూసుకెళుతున్న పూజ హెగ్డే కి తెలుగులో తిరుగులేదు. ఇంతవరకు సౌత్ సినిమాలైనా తెలుగులోనే హవా నడిపించిన పూజ హెగ్డే త్వరలోనే తమిళ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఇక తెలుగులో సక్సెస్ అవుతున్నప్పటికీ… అప్పుడప్పుడు బాలీవుడ్ పై కన్నేస్తున్న పూజ హెగ్డే గత ఏడాది హౌస్ ఫుల్ 4 తో సూపర్ హిట్ కొట్టడంతో స్టార్ హీరోల చూపు పూజ హెగ్డే పై పడింది. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ సినిమాలో పూజ హెగ్డే అవకాశం కొట్టేసింది. మరి స్టార్ హీరో సల్మాన్ సరసన అవకాశం అంటే మాములు విషయం కాదు. అదే విషయం పూజ కూడా ఒప్పుకుంటుంది. కబీ ఈద్ కబీ దివాళి సినిమాలో సల్మాన్ తో నటించడంపై పూజ ఏమంటుందంటే…

సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నా అని.. సల్మాన్ ఖాన్ తో నటించడం అంటే మనలోని టాలెంట్ కి ఇంకాస్త మెరుగు దిద్దుకోవాలని అర్ధం అని.. సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్ల నుండి సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాల అనుభవం ముందు మనమెంత అంటుంది పూజ హెగ్డే. సల్మాన్ అనుభవం ముందు నటించడానికి  కాస్త భయంగానే ఉందని…అగ్రనటులతో కలిసి నటించే ముందు ఇలానే ఉంటుందేమో అంటుంది. ఇక నటనలో మెళుకువలు నేర్చుకోవడానికి సల్మాన్ తో పని చెయ్యడం  ఓ అదృష్టమని… ఇక సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ కథ చాలా ఫన్నీగా… కూల్ గా ఉంటుంది ని చెబుతుంది. ఇక ఆగస్టు నుండి ఈ సినిమా సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది.. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన అది రీ షెడ్యూల్ అవ్వోచ్చేమో అంటుంది పూజ హెగ్డే.

Tags:    

Similar News