పూజమ్మ స్టయిల్ బావుందండి

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత లో పూజ హెగ్డే ఎన్టీఆర్ ని డామినేట్ చేసే పాత్రలో స్టైలిష్ గా రిచ్ గా క్లాసీ [more]

Update: 2019-12-12 06:26 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత లో పూజ హెగ్డే ఎన్టీఆర్ ని డామినేట్ చేసే పాత్రలో స్టైలిష్ గా రిచ్ గా క్లాసీ లుక్ లో నటించింది. అరవింద గా టైటిల్ రోల్ పోషించింది. తాజాగా అల్లు అర్జున్ తో రెండోసారి జోడి కడుతున్న పూజా హెగ్డే అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి బాస్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే బాస్ లుక్స్ ఎప్పుడో రివీల్ అయ్యాయి. తాజాగా ఆలా వైకుంఠపురములో టీజర్ లో పూజ హెగ్డే కనిపించింది కాసేపే అయినప్పటికీ…. పూజ స్టయిల్ రిచ్ గా గ్లామరస్ గా ఉంది. అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ లుక్, పూజ హెగ్డే రిచ్ అండ్ గ్లామర్ లుక్ అన్ని టీజర్ కి హైలెట్ అనేలా లున్నాయి.

రెండో హీరోయిన్ నివేత పేతురేజ్ లుక్ ని టీజర్ లో చూపించలేదు కానీ.. పూజ హెగ్డే ని మాత్రం కొన్ని సెకెన్స్ పాటు చూపించి మాయం చేశారు, మరి మేడం మేడమ్ అంటూ అల్లు అర్జున్, నవదీప్ – రాహుల్ రామకృష్ణ తో చేసిన ఆఫీస్ కామెడీ అల వైకుంఠపురములో స్పెషల్ గా వర్కౌట్ అవడమేకాదు.. ఎప్పటిలాగే త్రివిక్రమ్, పూజ హెగ్డే కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అలా వైకుంఠపురములో టీజర్ చెప్పకనే చెబుతుంది. కాకపోతే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఏదో ఒక జబ్బు ఉన్నట్టుగా.. ఈ సినిమాలోనూ పూజ హేగ్డ్ కి కాస్త బాస్ గా ఈగో పెట్టాడనిపిస్తుంది. మరి ఈగో పూజ, అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో ఆటాడుకుందో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Tags:    

Similar News