లేడి బాస్ ని ఎలా పడగొడతావ్ బన్నీ?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ సంగతి ఏమో కానీ.. సినిమా ప్రమోహన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ షూటింగ్ తో పాటుగా సినిమా [more]

Update: 2019-11-12 05:52 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ సంగతి ఏమో కానీ.. సినిమా ప్రమోహన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ షూటింగ్ తో పాటుగా సినిమా ప్రమోషన్ ని ఓ పద్దతిగా.. కొంచెం స్పెషల్ గా చేస్తున్నాడు. ఓ కీలక పాత్రలో సీనియర్ నటి టబు నటిస్తుండగా.. పూజ హెగ్డే, నివేత పెతురాజ్ లు హీరోయిన్స్. అయితే ఈ సినిమాలో టబు అల్లు అర్జున్ అక్కగా ఓ గొప్పింటి కోడలుగా కనబడుతుందని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ అక్క కోసం అన్ని వదులుకుని సామాన్యమైన జీవితం గడుపుతుంటాడని అల వైకుంఠపురములో కథ మీద రకరకాల కథలు వాడుకలోకి వచ్చాయి.

ఇక ముందు నుండి చెబుతున్నట్టే పూజ హెగ్డే ఈ సినిమాలో ఓ కంపెనీ బాస్ గా కనబడుతుందని, అందులోను అల్లు అర్జున్ కి ఆర్డర్స్ పాస్ చేసే బాస్ గా పూజ హెగ్డే కనిపిస్తుందట. బాస్ పాత్రలో చాలా స్ట్రిక్ట్ గా అల్లు అర్జున్ ని ఒణికించే పాత్ర అని, ఇక ఓ లక్ష్యం కోసం పనిచేస్తే.. సీరియస్ గా చెయ్యాలని ఎప్పుడు చెబుతూ అందరికి టెర్రర్ పరిచయం చేస్తుందట. మరి ఇలాంటి కోపిష్టి గ్లామరస్ బాస్ తో బన్నీ ఎలా రొమాన్స్ చేసి పడగడాతాడో అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. ఇక సినిమాలోని చాలా డైలాగ్స్ కామెడీతో కూడుకున్నవి అని, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు పడి పడి నవ్వుతారని చిత్ర బృందమే చెబుతుంది. ఇక ఇప్పటికే రెండు సాంగ్స్ మార్కెట్ ని షేక్ చేస్తే ఇప్పుడు మరో సాంగ్ రాబోతుంది. అలాగే ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన సుశాంత్ తన పాత్ర డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశాడు.

Tags:    

Similar News