అక్కడ సినిమా కోసం తెలుగు లో పెద్ద సినిమాలు వదులుకుంటుంది

తెలుగులో,తమిళంలో మంచి ఆఫర్స్ తో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే కి బాలీవుడ్ మీద ఇంకా మోజు తీరలేదు. అందుకే అక్కడ ఏమి అవకాశం [more]

Update: 2019-07-09 06:47 GMT

తెలుగులో,తమిళంలో మంచి ఆఫర్స్ తో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే కి బాలీవుడ్ మీద ఇంకా మోజు తీరలేదు. అందుకే అక్కడ ఏమి అవకాశం వచ్చిన వెంటనే పచ్చ జండా ఊపేస్తోంది. ఆమధ్య పూజా తెలుగు లో ఫుల్ బిజీగా ఉన్న టైములో బాలీవుడ్ నుండి ‘మొహంజుదారో’ అనే చిత్రంలో ఛాన్స్ వచ్చిందని రెండేళ్ల పాటు ఏ చిత్రం చేయకుండా ఫుల్ టైం దానికే ఇచ్చింది. తీరా అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరో సారి అటువంటి తప్పే చేస్తుంది పూజా.

బాలీవుడ్ లేటెస్ట్ గా హౌస్‌ఫుల్‌ 4 అనే చిత్రంలో నటించిన ఈమె అదే సంస్థకి మూడు సినిమాలకి సంతకం చేయగా, వాళ్లిప్పుడు ఆమెనుంచి బల్క్‌ డేట్స్‌ అడుగుతున్నారు. ఒక యాక్షన్ మూవీ ఏకంగా రెండు నెలలు డేట్స్ కావాలని కోరడంతో ఆమె ఏమి ఆలోచించకుండా ఇచ్చేసిందట. దీంతో మొదటి షెడ్యూల్‌ అయిన తర్వాత అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ల సినిమాకి రెండు నెలల పాటు ఆమె అందుబాటులో వుండదని తెలిసింది. రెండు నెలలు అంటే కష్టం కాబట్టి ఈసినిమాను త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేయాలి కాబట్టి ఆమె పాత్ర కుదించి మరో హీరోయిన్‌ రోల్‌ పెంచారని కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమా కోసం ఆమె సౌత్ నుండి మరో రెండు ప్రాజెక్ట్స్ వదులుకుంది సమాచారం.

Tags:    

Similar News