పాత్ర నచ్చలేదా? పారితోషికం నచ్చలేదా?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరో అందరికి తెలుసు. పూజ హెగ్డే అనగానే టాప్ హీరోయిన్ అనేస్తారు. స్టార్ హీరోల దగ్గరనుండి కుర్ర హీరోల వరకు [more]

Update: 2020-08-05 11:25 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరో అందరికి తెలుసు. పూజ హెగ్డే అనగానే టాప్ హీరోయిన్ అనేస్తారు. స్టార్ హీరోల దగ్గరనుండి కుర్ర హీరోల వరకు పూజ హెగ్డే నే బెస్ట్ ఆప్షన్ లా మారింది. సమంత, తమన్నా, కాజల్ లాంటి హీరోయిన్స్ అందరూ సీనియర్స్ లిస్ట్ లోకి  వచ్చేసారు. దానితో హీరోయిన్స్ కొరత. కాబట్టే నటనలో కాస్త వీక్ అయినా… గ్లామర్ షో తోనే స్టార్ హీరోలతో అవకాశాలు పట్టేస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పూజ వెంటే పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీ తో పాటుగా అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యచ్లర్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే కి పాత్ర నచ్చితే కుర్ర హీరో అని, చిన్న సినిమా అని చూడదనే విషయం గద్దలకొండ గణేష్ లోనే చూసాం. పాత్ర నచ్చితే ఒప్పుకునే పూజ హేగ్డ్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కి నో చెప్పింది అనే టాక్ నడుస్తుంది.

అది కూడా భీష్మ హిట్ తో ఉన్న నితిన్ కి పూజ హెగ్డే నో చెప్పింది అని.. అయితే హీరో నచ్చక కాదు.. . పారితోషికం నచ్చకే పూజ హెగ్డే ఇప్పుడు నితిన్ సినిమాని రిజెక్ట్ చేసిందిగా అనే టాక్ నడుస్తుంది. ఇంతకీ నితిన్ కి నో చెప్పిన సినిమా ఏది అంటే… బాలీవుడ్ అంధధూన్ సినిమా ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానికి హెల్ప్ చేసే పాత్రలో రాధికా ఆప్టే నటించింది. తెలుగులో ఆ పాత్ర కోసం పూజ హెగ్డే ని సంప్రదించినట్టుగా.. దానికి పూజ అధిక పారితోషికం అడిగితే ఇవ్వలేదని…. పూజ నితిన్ కి నో చెప్పిందిగా అంటున్నారు.

కానీ పూజ హెగ్డే పారితోషికం నచ్చక కాదు.. ఈ సినిమాని వదులుకుంది. పాత్ర నచ్చక అనే మరో టాక్ కూడా ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అంధధూన్ సినిమాలో రాధికా ఆప్టే కేవలం గ్లామర్ షో కి తప్ప మరెందుకు పనికి రాలేదు. అయితే సినిమా మొత్తం బోల్డ్ కేరెక్టర్ చేసిన టబు – హీరో ఆయుష్మాన్ చుట్టూనే తిరుగుతుంది కానీ… రాధికా ఆప్టే ది కేవలం గ్లామర్ షో కె పనికి వచ్చింది. అలాంటి కేరెక్టర్ లో చేస్తే కేవలం గ్లామర్ షో తప్ప పేరు రాదని పూజ హెగ్డే నితిన్ సినిమాకి నో చెప్పిందట. అదండీ విషయం. పాపమ్ పూజ ని ఆడిపోసుకుంటున్నారు.

Tags:    

Similar News