అదృష్టమంటే పూజా హెగ్డేదే..!

హీరోయిన్స్ కి అందం, నటన ఉంటే సరిపోదు అదృష్టం కూడా బాగా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో టాప్ లెవల్లో చెలరేగిపోతారు. గతంలో మీడియం రేంజ్ హీరోలతో రెండు [more]

Update: 2019-04-01 10:46 GMT

హీరోయిన్స్ కి అందం, నటన ఉంటే సరిపోదు అదృష్టం కూడా బాగా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో టాప్ లెవల్లో చెలరేగిపోతారు. గతంలో మీడియం రేంజ్ హీరోలతో రెండు మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్, బాలీవుడ్ భారీ మూవీలో నటించినా రాని క్రేజ్ కేవలం ఒకే ఒక్క సినిమాతో వచ్చేసింది ఆ హీరోయిన్ కి. ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. డీజేతో దున్నేస్తున్న పూజా లక్కు మాములుగా లేదు. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలే కాదు భారీ హీరోల సరసన నటిస్తుంది. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలతో ఏకకాలంలో బిజీ అయ్యి.. టాప్ లెవల్ కి చేరింది ఈ భామ. అందం, గ్లామర్ ఉంటే సరిపోతుందా లక్కు కూడా ఉండాలి. అదే పూజాకి ఉంది. అది మాములు లక్కు కాదు.. ఓ రేంజ్ లక్కన్నమాట.

ఒకేసారి మూడు సినిమాలు…

తాజాగా బాలీవుడ్ లో పూజాకి వచ్చిన ఆఫర్ చూస్తే.. పూజా హెగ్డే లక్కు ఎలా ఉందో తెలుస్తుంది. తెలుగుతో సినిమాలతో పాటుగా బాలీవుడ్ లోనూ హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది పూజ హెగ్డే. తాజాగా పూజాకి ఒక బంపర్ ఆఫర్ తగిలిందనే న్యూస్ వినబడుతుంది. బాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సాజిద్ న‌డియాడ్‌వాలా పూజా హెగ్డేతో ఏకంగా మూడు సినిమాల‌కి అగ్రిమెంట్ రాయించుకున్నాడట‌. ఈ అగ్రిమెంట్ చాలు పూజా రేంజ్ ఏమిటో చెప్పడానికి. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 నిర్మిస్తున్న సాజిద్.. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే పూజా హెగ్డేలోని టాలెంట్‌ని గ్ర‌హించి మ‌రో రెండు సినిమాల‌కి ఆమెతో ఒప్పందం చేసుకున్నాడ‌ట‌. మరి తెలుగులో గొప్ప హిట్స్ లేకుండానే టాప్ చైర్ ఎక్కబోతున్న పూజా.. బాలీవుడ్ లో కూడా హిట్ లేకుండా టాప్ చైర్ కి చెరువవుతుంది. మరి ఇదంతా పూజా హెగ్డే అదృష్టమనే చెప్పాలి.

Tags:    

Similar News