ఇప్పుడైనా బ్లాక్ బస్టర్ కొడతావా తల్లీ..!

హీరోయిన్ పూజాహెగ్డేకి ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. పూజ నటించిన ముకుందా, ఒక లైలా కోసం, డీజే దువ్వాడ జగన్నాధం, [more]

Update: 2019-05-06 08:30 GMT

హీరోయిన్ పూజాహెగ్డేకి ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. పూజ నటించిన ముకుందా, ఒక లైలా కోసం, డీజే దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత అన్నీ యావరేజ్ హిట్స్. బాలీవడ్ లో అయితే డిజాస్టర్ హీరోయిన్ పూజ హెగ్డే. అయినా పూజ హెగ్డే లాక్ ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలకు వేరే ఆప్షన్ లేక అందరూ పూజ గ్లామర్ చుట్టూనే తిరుగుతున్నారు. అమ్మడు ఎలాగూ అందాలు ఆరబోతకు అడ్డుచెప్పే రకం కాదు. అందుకే అమ్మడుకి అలా అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన మహర్షి మూవీ విడుదలకు సిద్దమయ్యింది. మహేష్ తో కలిసి నటించిన మహర్షి మీద బోలెడ‌న్ని అంచనాలున్నాయి.

హిట్ ద‌క్కుతుందా..?

మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని పూజ హెగ్డే తహతహలాడుతుంది. ఈ సినిమాలో మహెష్ కి ఫ్రెండ్ గా, లవర్ గా పూజ కనిపిస్తుంది అనేది ట్రైలర్లో చూపించారు. కానీ ఆమె క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందో రివీల్ చెయ్యలేదు. ఇక పూజ మరోసారి గ్లామర్ డాల్ అనేది మహర్షి ట్రైలర్ లో చూస్తే అనిపిస్తుంది. ఇక మహర్షి టీం మాత్రం సినిమా మీద మంచి హాప్స్ పెట్టుకుంది. మరి మహర్షి సినిమా సూపర్ హిట్ అయితే అందరికన్నా ఎక్కువగా ఆనందపడేది, కలిసొచ్చేది ఒక్క పూజ హెగ్డేకే. ఒకేలా మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్నాళ్లు పూజ టాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం. హిట్ అయినా, అవకపోయినా ప్రస్తుతం పూజ చేతిలో ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు ఉండనే ఉన్నాయి.

Tags:    

Similar News