వరుణ్ కోసం పూజా దిగుతుందా..?

ఈమధ్య పూజా హెగ్డే వ్యవహారం మాములుగా లేదు. టాలీవుడ్, బాలీవుడ్ కలిపి చుట్టేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ [more]

Update: 2019-04-23 08:25 GMT

ఈమధ్య పూజా హెగ్డే వ్యవహారం మాములుగా లేదు. టాలీవుడ్, బాలీవుడ్ కలిపి చుట్టేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ చైర్ ఎక్కడానికి రెడీ అయ్యింది. హరీష్ శంకర్ డీజే సినిమాలో పూజా హెగ్డేని చూపించిన విధానానికి, ఆమె గ్లామర్ కి స్టార్ హీరోలే పడిపోయారంటే.. పూజా లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్.. తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో పూజానే హీరోయిన్ అంటూ వార్తలొస్తున్న వేళ ఇప్పుడు మరో మెగా హీరో కోసం పూజా హెగ్డే రంగంలోకి దిగుతుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

వాల్మీకి చిత్రంలోనూ…

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో పూజా హెగ్డే నటించబోతుంది. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ గెడ్డం లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ వాల్మీకి సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ తేజ్ లవర్ గా పూజా హెగ్డే కనిపించబోతోందనేది తాజా సమాచారం. ఇప్పటికే వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ అనగానే సినిమా మీద ఆటోమాటిక్ గా హైప్ పెరిగితే.. ఇప్పుడు పూజా హెగ్డే క్రేజ్ కూడా సినిమా మీద హైప్ పెరగడానికి కారణమయ్యింది. మరి డీజేతో పూజా లక్కుని మార్చేసిన హరీష్ శంకర్ అడిగాడనే పూజా బిజీ షెడ్యూల్ లోనూ వరుణ్ కి లవర్ గా నటించడానికి ఒప్పుకుందని టాక్ అయితే సోషల్ మీడియాలో వినబడుతుంది.

Tags:    

Similar News